Begin typing your search above and press return to search.

OG + వీరమల్లు.. ఎంత గ్యాప్ లో అంటే..

తాజా సమాచారం ప్రకారం, హరి హర వీర మల్లును మే 9న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

By:  Tupaki Desk   |   10 March 2025 3:23 PM IST
OG + వీరమల్లు.. ఎంత గ్యాప్ లో అంటే..
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హరి హర వీర మల్లు సినిమా మరోసారి వాయిదా పడినట్లుగా స్పష్టమవుతోంది. అసలు ఈ సినిమా మార్చి 28న థియేటర్లలోకి రావాల్సి ఉండగా, షూటింగ్ ఇంకా పూర్తికాకపోవడంతో కొత్త విడుదల తేదీని మేకర్స్ లాక్ చేసినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అసెంబ్లీ సెషన్లతో బిజీగా ఉండటంతో, చివరి షెడ్యూల్ వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం, హరి హర వీర మల్లును మే 9న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

ఈ చిత్రం షూటింగ్ ఇంకా 20 రోజులు మిగిలి ఉంది. దర్శకుడు క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో, మిగిలిన పార్ట్‌ను ఏఎమ్ జ్యోతి కృష్ణ పూర్తి చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం, ఎట్టకేలకు ఒక స్థిరమైన విడుదల తేదీని అందుకున్నట్లు కనిపిస్తోంది. మే 9 అంటే వేసవి హాలిడే సీజన్ కావడంతో, సినిమాకు మంచి ఓపెనింగ్స్ దక్కే అవకాశం ఉంది. ఇప్పటికే హరి హర వీర మల్లు యొక్క నాన్ థియేట్రికల్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. అయితే థియేట్రికల్ బిజినెస్ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాత పూర్తికానుంది.

ఇదిలా ఉంటే, వీరమల్లు వచ్చిన 4 లేదా ఆరు నెలల్లో మరో సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ వీరమల్లు సినిమాను పూర్తిచేసిన వెంటనే తన మరో క్రేజీ ప్రాజెక్ట్ OG షూటింగ్‌లో జాయిన్ కానున్నట్లు సమాచారం. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయింది. పవన్‌ ఫ్యాన్స్ కు సరైన మాస్ ట్రీట్ ఇచ్చేలా ఈ సినిమా ఉండబోతుందని టాక్. పవర్‌ఫుల్ డైలాగ్స్, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ సినిమా మరో బిగ్ బ్లాక్‌బస్టర్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి.

OG షూటింగ్ పూర్తయ్యే టైంకు, దీన్ని సెప్టెంబర్ లేదా డిసెంబర్ లో విడుదల చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోందట. పవన్ కళ్యాణ్ పొలిటికల్ కమిట్‌మెంట్స్ ఎక్కువగా ఉండటంతో, OG మేకర్స్ షెడ్యూల్‌ను అతనికి అనుకూలంగా ప్లాన్ చేస్తున్నారు. రాజకీయ ప్రస్థానం నేపథ్యంలో పవన్ తక్కువ టైమ్ కేటాయించగలిగినప్పటికీ, దర్శకుడు సుజీత్ ప్లానింగ్ స్ట్రాంగ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

సినిమా షూటింగ్‌ను స్పీడ్‌గా పూర్తిచేసి దీపావళి లేదా క్రిస్మస్ సీజన్‌లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. హరి హర వీర మల్లు పాన్ ఇండియా లెవల్‌లో విడుదల కాబోతున్న సినిమా. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఏఎమ్ రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ఎప్పటి నుంచో పవన్ అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు మే 9న విడుదల కానుందనే విషయం తెలియడంతో అభిమానులలో కొంత ఊరట లభించింది. ఈ ఏడాది పవన్ కళ్యాణ్‌కు రెండు భారీ సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. ఒకటి హరి హర వీర మల్లు, మరొకటి OG. ఒకటి మేలో, మరొకటి సెప్టెంబర్ లేదా డిసెంబర్ లో రావడంతో పవన్ బాక్సాఫీస్‌ను గట్టిగా షేక్ చేయనున్నాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.