Begin typing your search above and press return to search.

సూర్య 'కంగువా'.. ఓ టెన్షన్ తీరింది

రిలయన్స్ కంపెనీకి బాకీ ఉన్న మొత్తాన్ని పూర్తిగా చెల్లించామని స్టూడియో గ్రీన్ కంపెనీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

By:  Tupaki Desk   |   9 Nov 2024 11:03 AM GMT
సూర్య కంగువా.. ఓ టెన్షన్ తీరింది
X

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కంగువా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. సిరుతై శివ దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న కంగువాను నవంబర్ 14వ తేదీన రిలీజ్ చేస్తామని మేకర్స్ కొద్ది రోజుల క్రితం అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సాంగ్స్.. మ్యూజిక్ లవర్స్ ను తెగ ఆకట్టుకున్నాయి. టీజర్ సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది. అదే సమయంలో ఇప్పుడు సినిమా రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది. అసలేం జరిగిందంటే?

ప్రముఖ నిర్మాణ సంస్థ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్.. రీసెంట్ గా కంగువా రిలీజ్ పై స్టే విధించాలని మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. నిర్మాత జ్ఞానవేల్ రాజా తమ వద్ద తీసుకున్న రుణ మొత్తాన్ని చెల్లించలేదని కేసు దాఖలు చేసింది. రూ.99 కోట్లకు పైగా పొంది 45 కోట్ల రూపాయలు మాత్రమే తిరిగి చెల్లించారని, మిగిలిన 55 కోట్ల రూపాయలను ఇవ్వకుండా కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘించారని కోర్టుకు తెలిపింది.

దీంతో అక్టోబర్ 30వ తేదీన రిలయన్స్ సంస్థ తరఫున లాయర్ వాదనలు విన్న హైకోర్టు.. కంగువా రిలీజ్ పై స్టే విధించింది. నవంబర్ 7వ వరకు సినిమాను రిలీజ్ చేయొద్దని ఆదేశించింది. అదే రోజుకు విచారణను వాయిదా వేసింది. కొన్ని కారణాల వల్ల శుక్రవారం మళ్లీ విచారణ జరిపింది. జస్టిస్ అబ్దుల్ ఖుద్దూస్ రిలయన్స్ దాఖలు చేసిన కేసును పరిశీలించారు. ఆ సమయంలో స్టూడియో గ్రీన్ కంపెనీ తరఫు న్యాయవాది హాజరై వాదనలు వినిపించారు.

రిలయన్స్ కంపెనీకి బాకీ ఉన్న మొత్తాన్ని పూర్తిగా చెల్లించామని స్టూడియో గ్రీన్ కంపెనీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో జస్టిస్ అబ్దుల్ ఖుద్దూస్ తుది తీర్పు వెల్లడించారు. కేసును ముగించి కంగువా సినిమా విడుదలకు అనుమతించారు. రిలీజ్ కు ఎలాంటి అడ్డంకులు లేవని ఆదేశాలు జారీ చేశారు. దీంతో మేకర్స్.. నవంబర్ 14వ తేదీన కంగువా వరల్డ్ వైడ్ గా పదికి పైగా భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు.