Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాలలో ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాస్ మూవీస్

కంటెంట్ ప్రేక్షకులకి ఏ మాత్రం నచ్చిన అంచనాలకి మించి సక్సెస్ ని అందిస్తున్నారు.

By:  Tupaki Desk   |   26 Dec 2024 11:11 AM GMT
తెలుగు రాష్ట్రాలలో ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాస్ మూవీస్
X

టాలీవుడ్ లో పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత 100 కోట్ల కలెక్షన్స్ అనేది చాలా చిన్నదైపోయింది. పెద్ద సినిమాలు 500 లేదా 1000 కోట్ల టార్గెట్ తో థియేటర్స్ లోకి వస్తున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమాలకి దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. కంటెంట్ ప్రేక్షకులకి ఏ మాత్రం నచ్చిన అంచనాలకి మించి సక్సెస్ ని అందిస్తున్నారు. అలాగే ఎవ్వరు ఊహించని కలెక్షన్స్ ని ఆ చిత్రాలకి ఇస్తున్నారు.

ఈ ఏడాది టాలీవుడ్ నుంచి వచ్చిన 'కల్కి 2898ఏడీ', 'పుష్ప 2' సినిమాలు 1000 కోట్లకి పైగా కలెక్షన్స్ ని అందుకున్నాయి. 'దేవర పార్ట్ 1' మూవీ 400 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది. ఇక 'హనుమాన్' మూవీ 300+ కోట్లు కలెక్ట్ చేసింది. వీటిలో అత్యధికంగా 1700+ కోట్ల కలెక్షన్స్ తో 'పుష్ప 2' టాప్ లో ఉంది. తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ చిత్రం మూడు వారాల్లో 304.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

ఇంకా థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ఓవరాల్ గా తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన ఆల్ టైం సినిమాల జాబితా చూసుకుంటే వాటిలో 'ఆర్ఆర్ఆర్' మూవీ మొదటి స్థానంలో ఉంది. ఈ సినిమా ఏకంగా 405.9 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని లాంగ్ రన్ లో అందుకుంది. దీని తర్వాత 327.9 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో 'బాహుబలి 2' రెండో స్థానములో ఉంది.

'పుష్ప 2' మూవీ ఇప్పటి వరకు 304.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి మూడో స్థానంలోకి వచ్చింది. లాంగ్ రన్ లో ఈ సినిమా ఏ మేరకు వసూళ్లని అందుకోగలుగుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నాలుగో స్థానంలో 'కల్కి 2898ఏడీ' మూవీ 275.5 కోట్ల గ్రాస్ తో నిలిచింది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'దేవర' చిత్రం 233 కోట్లు కలెక్ట్ చేసి టాప్ 5లోకి వచ్చింది.

2025 సంక్రాంతి కానుకగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ చేంజర్', బాలకృష్ణ 'డాకు మహారాజ్' సినిమాలు థియేటర్స్ లోకి రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలకి కూడా తెలుగు రాష్ట్రాలలో 200 కోట్ల కలెక్షన్స్ క్లబ్ లో చేరే సత్తా ఉంది. ముఖ్యంగా 'గేమ్ చేంజర్' పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతోన్న నేపథ్యంలో ఈ సినిమాపై అందరి చూపు ఉంది. మరి రామ్ చరణ్ ఏ మేరకు కలెక్షన్స్ ని తన సినిమాతో అందుకుంటాడనేది చూడాలి.

ఏపీ తెలంగాణలో టాప్ గ్రాస్ మూవీస్

ఆర్ఆర్ఆర్ - ₹405.9 Cr

బాహుబలి 2 - ₹327.9 Cr

పుష్ప 2 - (3వారాలు) - ₹304.5Cr***

కల్కి 2898ఏడీ - ₹275.5Cr

దేవర పార్ట్ 1 - ₹233Cr