2.5 కోట్ల రెమ్యునరేషన్.. బిగ్ బాస్ నెవర్ బిఫోర్ రికార్డ్..!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఈమధ్యనే ముగిసింది. 106 రోజుల బిగ్ బాస్ జర్నీలో 22 మంది కంటెస్టెంట్స్ తమ ఆటలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు.
By: Tupaki Desk | 18 Dec 2024 11:30 PM GMTబిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఈమధ్యనే ముగిసింది. 106 రోజుల బిగ్ బాస్ జర్నీలో 22 మంది కంటెస్టెంట్స్ తమ ఆటలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు. సీజన్ 8 విన్నర్ గా నిఖిల్ మాలియక్కల్ 55 లక్షల ప్రైజ్ మనీతో పాటుగా 105 రోజులు హౌస్ లో ఉన్నందుకు 33 లక్షల దాకా రెమ్యునరేషన్ కూడా అందుకున్నాడని తెలుస్తుంది. అంటే మొత్తంగా 88 లక్షల దాకా రెమ్యునరేషన్ దానితో పాటుగా మారుతి సుజుకి డిజైర్ కూడా నిఖిల్ గెలుపొందాడు. ఐతే బిగ్ బాస్ చరిత్రలో ఒక కంటెస్టెంట్ కి హైయెస్ట్ పారితోషికం ఇచ్చారు.
బిగ్ బాస్ తెలుగు మాత్రమే కాదు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళం ఇలా అన్ని భాషల్లో బిగ్ బాస్ షో నడుస్తుంది. కానీ బిగ్ బాస్ చరిత్రలో ఒక కంటెస్టెంట్ కి రెండున్నర కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారట. అది కూడా ఆ కంటెస్టెంట్ 3 రోజులు మాత్రమే హౌస్ లో ఉన్నందుకు ఆ రెమ్యునరేషన్ ఇచ్చారట. ఇంతకీ ఇది ఎప్పుడు ఎక్కడ జరిగింది అన్నది డీటైల్స్ లోకి వెళ్తే.. బిగ్ బాస్ హిందీ ప్రస్తుతం 18వ సీజన్ రన్ అవుతుంది. బిగ్ బాస్ హిందీ మొదటి సీజన్లలో టైటిల్ విజేతకు 1 కోటి ప్రైజ్ మనీ ఇచ్చేవారు.
ఐతే తర్వాత సీజన్లలో దాన్ని 50 లక్షలు చేశారు. బిగ్ బాస్ ఆదరణ పెరుగుతున్నా కొద్దీ ప్రైజ్ మనీ పెంచుతూ వచ్చారు. ఐతే బిగ్ బాస్ సీజన్ 4 కి మరింత హైప్ తెచ్చేందుకు కెనెడియన్ నటి పమేలా ఆండర్సన్ ని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చారు.
హాలీవుడ్ సూపర్ హిట్ సీరీస్ బేవాచ్ తో పాటు స్నాప్ డ్రాగన్, స్కూబీ డూ సినిమాల్లో నటించింది పమేలా అండర్సన్. వాటి వల్ల ఆమెకు భారీ క్రేజ్ వచ్చింది. అందుకే ఆమెను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చారు. పమెలా కూడా ఒక కంటెస్టెంట్ గా జస్ట్ 3 రోజులు హౌస్ లో ఉంది. ఐతే ఆమె అలా ఉన్నందుకు దాదాపు రెండున్నర కోట్ల దాకా పారితోషికం ఇచ్చారని తెలుస్తుంది. బిగ్ బాస్ ఇండియా లో కెనడియన్ నటి పాల్గొన్నది అంటూ మీడియా ప్రచారంతో ఆ సీజన్ సూపర్ హిట్ అయ్యింది.
పమేలాకి ఇచ్చిన పారితోషికం చాలా ఎక్కువే అయినా దాని వల్ల వచ్చిన ప్రచారం చాలా గొప్పది. ఇక పమేలా తర్వాత గ్రేట్ ఖాలి 50 లక్షల హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్నాడని తెలుస్తుంది. ఇదే క్రమంలో కరణ్ వీర్ బొహ్రా కూడా అప్పట్లోనే 20 లక్షల దాకా రెమ్యునరేషన్ అందుకున్నట్టు తెలుస్తుంది.