Begin typing your search above and press return to search.

ఈ ఏడాది అత్యధిక ప్రాఫిట్ ఇచ్చిన సినిమా ఏదో తెలుసా..

ప్రతి ఏడాది వందల నుంచి వేల సంఖ్యలో సినిమాలు ఇండియాలో వివిధ భాషలలో రిలీజ్ అవుతూ ఉంటాయి.

By:  Tupaki Desk   |   7 Oct 2024 10:30 PM GMT
ఈ ఏడాది అత్యధిక ప్రాఫిట్ ఇచ్చిన సినిమా ఏదో తెలుసా..
X

ప్రతి ఏడాది వందల నుంచి వేల సంఖ్యలో సినిమాలు ఇండియాలో వివిధ భాషలలో రిలీజ్ అవుతూ ఉంటాయి. సినిమా కంటెంట్ బాగుంటే బాషతో పరిమితం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని కొన్ని చిత్రాలు ప్రూవ్ చేస్తూ ఉంటాయి. మరికొన్ని సినిమాలు మాత్రం చాలా రియలిస్టిక్ కథ, కథనాలతో… రెగ్యులర్ గా మన చుట్టూ జరిగే సంఘటనతో తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి ఊహించని విజయాలు సొంతం చేసుకుంటాయి.

అల్టిమేట్ గా ప్రేక్షకులకి కావాల్సింది రెండు నుంచి మూడు గంటల వినోదం. అలాంటి వినోదం కోసం ఎలాంటి కథలు ఎంచుకుంటారనేది డైరెక్టర్స్, నిర్మాతల ఛాయస్. ఈ ఏడాది ఇండియాలో వివిధ భాషలలో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ హిట్స్ గా నిలిచిన సినిమాల జాబితా చూసుకుంటే ‘కల్కి 2898ఏడీ’ సినిమా కనిపిస్తుంది. ఈ మూవీ వెయ్యి కోట్లకి పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. అయితే మూవీ కలెక్షన్స్ భారీగా వచ్చిన ఈ సినిమా నిర్మాణ వ్యయం కూడా 600 కోట్ల పైనే ఉంది. అందుకే పెట్టుబడి ఎక్కువ కావడం వలనమూవీకి వచ్చిన లాభాలు తక్కువగా ఉన్నాయి.

బాలీవుడ్ నుంచి వచ్చిన ‘స్త్రీ 2’ మూవీ ఈ ఏడాది సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న చిత్రంగా నిలిచింది. ఈ సినిమాని 50 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తే ఏకంగా 800 కోట్లకి పైగా కలెక్షన్స్ లాంగ్ రన్ లో వచ్చాయి. అత్యధిక ప్రాఫిట్ తీసుకొచ్చిన సినిమాలలో ‘స్త్రీ 2’ ఒకటిగా నిలిచింది. మలయాళంలో రియల్ సంఘటనలు బేస్ చేసుకొని తెరకెక్కిన ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. మూవీ లాంగ్ రన్ లో ఏకంగా 242 కోట్లకి పైగా కలెక్షన్స్ వసూళ్లు చేసింది. బడ్జెట్ కి 12 రేట్లు అధికంగా ఈ మూవీ కలెక్షన్స్ ఉండటం విశేషం.

వీటన్నిటి కంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమా ‘ప్రేమలు’. పెద్దగా ఫేమ్ లేని యాక్టర్స్ తో కేవలం 3 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా కథ బ్యాక్ డ్రాప్ ఎక్కువగా హైదరాబాద్ నేపథ్యంలో ఉంటుంది. అయిన కూడా మలయాళంలో ఈ మూవీ ఏకంగా 100 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ మూవీకి అద్భుతమైన టాక్ రావడంతో సుదీర్ఘ కాలం థియేటర్స్ లో కొనసాగింది.

యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని విపరీతంగా ఆదరించారు. తెలుగులో కూడా ‘ప్రేమలు’ మూవీకి అద్భుతమైన టాక్ వచ్చింది. లాంగ్ రన్ లో ఈ సినిమా ఏకంగా 136 కోట్ల కలెక్షన్స్ ని వసూళ్లు చేసింది. ఈ సినిమా పెట్టిన పెట్టుబడి కంటే 4500% ఎక్కువ కలెక్షన్స్ అందుకుంది. అంటే ఈ ఏడాది పెట్టిన పెట్టుబడికి అత్యధిక ప్రాఫిట్ తీసుకొచ్చిన సినిమాల జాబితాలో ప్రేమలు నెంబర్ వన్ లో ఉందని చెప్పాలి.