Begin typing your search above and press return to search.

2024లో వరల్డ్ వైడ్ గా అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాలివే

అలాగే వరల్డ్ వైడ్ గా హాలీవుడ్ సినిమాలకి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్ని దేశాలలో ఈ సినిమాలకి ప్రేక్షకాదరణ ఉంటుంది.

By:  Tupaki Desk   |   31 Dec 2024 9:51 AM GMT
2024లో వరల్డ్ వైడ్ గా అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాలివే
X

ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీని షేక్ చేసిన సినిమాగా ‘పుష్ప 2’ మూవీ నిలిచింది. ఈ సినిమా అంచనాలకి మించి వరల్డ్ వైడ్ గా 1700 కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకుంది. ఈ చిత్రంతో పాటు ‘కల్కి 2898ఏడీ’ మూవీ ఈ ఏడాది 1000 కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకుంది. వరల్డ్ వైడ్ గా ఇండియన్ సినిమా స్టామినాని ఈ రెండు చిత్రాలు ప్రదర్శించాయి.

అలాగే వరల్డ్ వైడ్ గా హాలీవుడ్ సినిమాలకి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్ని దేశాలలో ఈ సినిమాలకి ప్రేక్షకాదరణ ఉంటుంది. హాలీవుడ్ సినిమాలు వేలకోట్ల కలెక్షన్స్ ని చాలా ఈజీగా వసూళ్లు చేస్తూ ఉంటాయి. అలా ఈ ఏడాది హాలీవుడ్ లో భారీ కలెక్షన్స్ కొల్లగొట్టిన సినిమాల జాబితా చూసుకుంటే వాటిలో మొదటి స్థానంలో ‘ఇన్సైడ్ అవుట్ 2’ ఉంది.

ఈ చిత్రం ఏకంగా 1.7 బిలియన్ డాలర్స్ కలెక్షన్స్ సాధించింది. ఇది ఒక యానిమేటెడ్ మూవీ కావడం విశేషం. దీనిని బట్టి యానిమేటెడ్ సినిమాలకి హాలీవుడ్ లో ఏ స్థాయిలో ఆదరణ ఉందో అర్ధం చేసుకోవచ్చు. అలాగే సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ ని ‘డెడ్‌పూల్ అండ్ వాల్వెరైన్’ కలెక్ట్ చేసింది. మార్వెల్ సూపర్ హీరో కథలలో భాగంగా ఈ చిత్రం వచ్చింది. ఈ మూవీ ఏకంగా 1.3 బిలియన్ డాలర్స్ వసూళ్లు చేసింది.

ఇక థర్డ్ హైయెస్ట్ కలెక్షన్స్ ‘డెస్పికబుల్ మీ 4’ మూవీ వసూళ్లు చేసింది. ఇదికూడా యానిమేటెడ్ కామెడీ మూవీగా వచ్చింది. ఏకంగా 970 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ అందుకుంది. అలాగే యానిమేటెడ్ మూవీ ‘మోనా 2’ నాలుగో హైయెస్ట్ కలెక్షన్స్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం 830 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. దీని తర్వాత టాప్ 5 చిత్రంగా ‘డ్యూన్ 2’ నిలిచింది.

ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 715 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్ 5 చిత్రాలలో మూడు యానిమేటెడ్ సినిమాలే ఉండటం విశేషం. దీనిని బట్టి ప్రపంచ వ్యాప్తంగా యానిమేషన్ సినిమాలకి ఏ స్థాయిలో ఆదరణ ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఇన్సైడ్ అవుట్ 2 - USD 1.7B

డెడ్‌పూల్ అండ్ వాల్వెరైన్ - USD 1.3B

డెస్పికబుల్ మీ 4 - USD 970M

మోనా 2 - USD 830M

డ్యూన్ 2 - USD 715M