Begin typing your search above and press return to search.

కల్కి.. ఆ ఒక్క మల్టీప్లెక్స్ లోనే 5 కోట్లా..

చైనీస్ భాషలో కూడా కల్కి2898ఏడీని రిలీజ్ చేయనున్నారు. కచ్చితంగా ఈ సినిమా హాలీవుడ్ లెవల్ లో సౌండ్ క్రియేట్ చేయడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   16 July 2024 4:10 AM GMT
కల్కి.. ఆ ఒక్క మల్టీప్లెక్స్ లోనే 5 కోట్లా..
X

వరల్డ్ వైడ్ గా తెలుగు సినిమా స్థాయిని మరోసారి అందరికి తెలిసేలా చేసింది కల్కి 2898ఏడీ మూవీ. మన దర్శకులు కూడా హాలీవుడ్ రేంజ్ కథలని విజువల్ స్పెక్టక్యులర్ గా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించగలరని ఈ సినిమాతో ప్రూవ్ అయ్యింది. బాహుబలి 2 సినిమా ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ గురించి వరల్డ్ వైడ్ గా అందరికి తెలిసేలా చేసింది. ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ బరిలో పోటీ పడి హాలీవుడ్ దర్శకుల దృష్టిని ఆకర్షించింది.

ఇప్పుడు కల్కి 2898ఏడీ మూవీ వరల్డ్ వైడ్ గా వండర్స్ క్రియేట్ చేస్తోంది. ఇంగ్లీష్ వెర్షన్ కూడా రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అయితే అది డైరెక్ట్ ఓటీటీలో ఉంటుందా లేదంటే థియేటర్స్ రిలీజ్ చేస్తారా అనేది క్లారిటీ లేదు. చైనీస్ భాషలో కూడా కల్కి2898ఏడీని రిలీజ్ చేయనున్నారు. కచ్చితంగా ఈ సినిమా హాలీవుడ్ లెవల్ లో సౌండ్ క్రియేట్ చేయడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది.

మన మైథాలజీకి సైన్స్ ఫిక్షన్ జోడించి నాగ్ అశ్విన్ తెరపై అద్భుత ప్రపంచాన్ని ఆవిష్కరించారు. అందుకే ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ 1000 కోట్ల కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా క్రాస్ చేసింది. నార్త్ అమెరికాలో 18 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ దాటినట్లు తెలుస్తోంది. హిందీ వెర్షన్ కూడా 300 కోట్ల దిశగా అడుగులు వేస్తోంది. ఇలా రిలీజ్ అయిన అన్ని భాషలలో కల్కికి అపూర్వ ఆదరణ లభిస్తోంది.

ఇకపోతే ఈ సినిమా హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. 18 రోజుల్లో ఈ ఒక్క మల్టీప్లెక్స్ లోనే 4.8 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. మొత్తం 400 షోలు ఇప్పటి వరకు పడ్డాయి. అలాగే 1.2 లక్షల మంది ప్రేక్షకులు ఈ సినిమాని ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ఇంత వరకు వీక్షించారంట. ఒక్క ప్రసాద్ లోనే 5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కి చేరువగా కల్కి మూవీ ఉంది. ఇప్పటికి డీసెంట్ వసూళ్లు వస్తూ ఉండటంతో లాంగ్ రన్ లో ప్రసాద్ మల్టీప్లెక్స్ లో హైయెస్ట్ కలెక్షన్స్ మూవీగా కల్కి 2898ఏడీ నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.

ఇదంతా కేవలం కల్కి మూవీ కంటెంట్ లో ఉన్న దమ్ము, ప్రభాస్ మాస్ ఇమేజ్, నాగ్ అశ్విన్ విజువలైజేషన్ తో సాధ్యం అయ్యిందని చెప్పొచ్చు. అలాగే అమితాబ్ బచ్చన్ చాలా ఏళ్ళ తర్వాత పవర్ ఫుల్ క్యారెక్టర్ ని ఈ చిత్రంలో చేశారు. దీపికా పదుకునే కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ఓవరాల్ గా అన్ని క్రాఫ్ట్స్ నుంచి బెస్ట్ అవుట్ ఫుట్ వస్తే ఆడియన్స్ ఎలాంటి రిజల్ట్ ఇస్తారనేది కల్కి మూవీతో రుజువైంది.