రీరిలీజ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న సినిమాలివే
ఇదిలా ఉంటే ఇప్పటి వరకు తెలుగు, తమిళ్, మలయాళీ భాషలలో రీరిలీజ్ అయిన సినిమాలలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న మూవీ
By: Tupaki Desk | 11 Aug 2024 4:41 AM GMTసౌత్ లో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ జోరుగా నడుస్తోంది. స్టార్ హీరోల పాత హిట్ సినిమాలని మరల 4K వెర్షన్ లో ప్రేక్షకుల ముందుకి తీసుకొని వస్తున్నారు. హీరోల బర్త్ డే స్పెషల్ గా ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా ఈ ఓల్డ్ మూవీస్ ని రీరిలీజ్ చేస్తున్నారు. వీటికి ఆదరణ వస్తూ ఉండటంతో కొంతమంది డిస్టిబ్యూటర్స్ అలాగే నిర్మాతలు కూడా నేరుగా రీరిలీజ్ సినిమాల బిజినెస్ లోకి దిగిపోయారు. మూవీ రీరిలీజ్ రైట్స్ సొంతం చేసుకొని 4K వెర్షన్స్ లో ప్రేక్షకులకి అందిస్తున్నారు.
ఈ రీరిలీజ్ సినిమాలకి వీటికి నెల రోజుల ముందు నుంచే ప్రచారం కల్పిస్తున్నారు. దీంతో పబ్లిక్ లో కూడా రీరిలీజ్ సినిమాపై చర్చ ఎక్కువ నడుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు తెలుగు, తమిళ్, మలయాళీ భాషలలో రీరిలీజ్ అయిన సినిమాలలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న మూవీ అంటే ఇళయదళపతి హిట్ సినిమా ‘గిలి’ అని చెప్పాలి. మహేష్ బాబు ‘ఒక్కడు’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మరల ఆ చిత్రాన్ని 4K వెర్షన్ లో రీరిలీజ్ చేయగా ఏకంగా 32.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.
దీని తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ మూవీ రీరిలీజ్ అయ్యి అత్యధికంగా 7.46 కోట్ల కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా వసూళ్లు చేసింది. నెక్స్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు ‘బిజినెస్ మెన్’ సినిమా 5.85 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో టాప్ 3లో ఉంది. తాజాగా రిలీజ్ అయిన ‘మురారి’ మూవీ 5.41 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకొని టాప్ 4లోకి దూసుకొచ్చింది. బిజినెస్ మెన్ సినిమా కలెక్షన్స్ ని కూడా మురారి బ్రేక్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.
మలయాళంలో మోహన్ లాల్ హీరోగా 1995 లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయిన స్పదికం మూవీ రీరిలీజ్ అయ్యి 4.90 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. దీంతో ఈ మూవీ టాప్ 5 హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన సెకండ్ మూవీ సింహాద్రి రీరిలీజ్ సందర్భంగా వరల్డ్ వైడ్ గా 4.60 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసి టాప్ 6లో నిలవడం విశేషం.
టాప్ 10 లిస్ట్ చూసుకుంటే..
గిలి4K – 32.50CR
ఖుషి – 7.46CR
బిజినెస్ మెన్4K – 5.85Cr
మురారి4K – 5.41Cr******
స్పదికం (మలయాళం) – 4.90CR
సింహాద్రి4K – 4.60CR
ఈ నగరానికి ఏమైంది – 3.52CR
సూర్య సన్నాఫ్ కృష్ణన్ – 3.40CR
ఆరెంజ్4K – 3.36CR
జల్సా – 3.20CR