అత్యధిక పారితోషికం అందుకునే కన్నడ హీరో
అయితే వారందరినీ మించిపోయి బాలీవుడ్ ఎ లిస్టర్లకు సైతం రెమ్యునరేషన్ విషయంలో గట్టి పోటీ ఇస్తున్న నటుడు ఒకరున్నారు.
By: Tupaki Desk | 18 Feb 2024 3:30 PM GMTకిచ్చా సుదీప్, ఉపేంద్ర, రిషబ్ శెట్టి వంటి ప్రముఖ కన్నడ హీరోలు భారీ పారితోషికాలు అందుకుంటున్నారు. అయితే వారందరినీ మించిపోయి బాలీవుడ్ ఎ లిస్టర్లకు సైతం రెమ్యునరేషన్ విషయంలో గట్టి పోటీ ఇస్తున్న నటుడు ఒకరున్నారు. అతడు ఎవరు? అంటే....!
పాపులర్ కన్నడ వెబ్ సైట్ అందించిన కథనం ప్రకారం.. శాండల్‌వుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడు యష్. ఒక ప్రాజెక్ట్‌లో అతను పోషించే పాత్రను బట్టి దాదాపు 50 నుండి 100 కోట్ల వరకు వసూలు చేస్తున్నాడని సమాచారం. చాలా దక్షిణ భారత టీవీ షోలలో కనిపించిన తర్వాత యష్ 2007లో జంబద హుడుగితో సినిమాల్లోకి అడుగుపెట్టాడు. అతడు కథానాయకుడిగా నటించిన మొదటి ప్రధాన పాత్ర చిత్రం రాకీ (2008) బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినా, అతడు వరుస శృంగార చిత్రాలతో తిరిగి ప్రయత్నించాడు. భారీ కమర్షియల్ విజయాలు అందుకున్నాడు.
2018లో యష్ .. ప్రశాంత్ నీల్‌తో పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ KGF: చాప్టర్ 1 కోసం కలిసి పనిచేశాడు. ఇది అతడిని కొత్త స్థాయి స్టార్‌డమ్ వైపు నడిపించింది. తరువాత 2022లో యష్- ప్రశాంత్ నీల్ సీక్వెల్, KGF: చాప్టర్ 2తో తిరిగి వచ్చారు. ఇది 1000 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిన గొప్ప బ్లాక్‌బస్టర్. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. యష్ KGF చాప్టర్ 2లో నటించినందుకు 30 కోట్ల పారితోషికం వసూలు చేసాడు. దానితో పాటు సినిమా లాభాలలో వాటా కూడా ఉంది.
యష్ తర్వాత దర్శన్ తూగుదీప ప్రతి సినిమాకు దాదాపు రూ. 20 కోట్లు వసూలు చేస్తున్నాడు. మూడవ స్థానం కిచ్చా సుదీప్‌కి చెందుతుంది. అతడు ఫూంక్, రాన్, దబాంగ్ 3 వంటి అనేక బాలీవుడ్ చిత్రాలలో కూడా నటించాడు. జీ న్యూస్ నివేదిక ప్రకారం... 52 ఏళ్ల సుదీప్ దాదాపు రూ. 10 కోట్ల నుండి రూ. 25 వరకు పారితోషికం డిమాండ్ చేశాడు. శాండల్‌వుడ్ పరిశ్రమలో ఇతర అగ్రనటులు ఉపేంద్ర, రిషబ్ శెట్టి వివిధ ఆన్‌లైన్ రిపోర్టుల ప్రకారం .. ఒక్కో సినిమాకు దాదాపు రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు వసూలు చేస్తున్నారు.
ప్రస్తుతం అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కన్నడ నటుడు యష్ బెంగళూరులో దాదాపు రూ. 4 కోట్ల విలువైన విలాసవంతమైన డ్యూప్లెక్స్‌ను కలిగి ఉన్నారు. మెర్సిడెస్ బెంజ్ GLS 350D, మెర్సిడెస్ GLC 250D కూపే, రేంజ్ రోవర్ ఎవోక్ సహా అతని గ్యారేజీలో అనేక అత్యంత ఖరీదైన విలాసవంతమైన కార్లు కూడా ఉన్నాయి. పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. యష్ నికర ఆస్తుల విలువ 7 మిలియన్ డాలర్లు. ఇది సుమారు రూ. 58 కోట్లు.