హైయెస్ట్ షేర్ తెచ్చిన సినిమాలు.. లేటెస్ట్ గా మరో రెండు
ఈ సినిమా ఏకంగా 272.31 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. తరువాత బాహుబలి 2 మూవీ ఉంది. ఈ చిత్రం 204 కోట్ల షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు చేసింది.
By: Tupaki Desk | 21 Feb 2024 4:22 AM GMT2020 తర్వాత టాలీవుడ్ సినిమా స్టాండర్డ్స్ పూర్తిగా మారిపోయాయి. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఒకప్పుడు తెలుగు మూవీ అంటే కంటెంట్ లేని కమర్షియల్ సినిమాలు అనే ప్రచారం ఉండేది. అయితే బాహుబలి సిరీస్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న నెగిటివ్ ప్రచారాన్ని పూర్తిగా తుడిచేసింది. బాహుబలితో రాజమౌళి ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని మిగిలిన డైరెక్టర్స్ కూడా బలమైన కథలని కమర్షియల్ జోనర్ లో చెప్పొచ్చని డిసైడ్ అయ్యారు.
నిర్మాతలు కూడా భారీ బడ్జెట్ లు పెట్టి సినిమాలు చేయడానికి భయపడటం లేదు. దానికి తగ్గట్లుగానే బలమైన కథ, కథనాలు ఉన్న సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో కూడా అద్భుతమైన కలెక్షన్స్ ని కొల్లగొడుతున్నాయి. ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో తెలుగు రాష్ట్రాలలో హైయెస్ట్ షేర్ అందుకున్న సినిమాల జాబితాలో టాప్ 1 లో ఆర్ఆర్ఆర్ నిలిచింది.
ఈ సినిమా ఏకంగా 272.31 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. తరువాత బాహుబలి 2 మూవీ ఉంది. ఈ చిత్రం 204 కోట్ల షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు చేసింది. మూడో స్థానంలో గత ఏడాది డార్లింగ్ ప్రభాస్ నుంచి వచ్చిన సలార్ 150 కోట్ల షేర్ తో నిలవడం విశేషం. తరువాత స్థానాలలో అల వైకుంఠపురంలో 130.17 కోట్లతో నిలిచింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ 117.50 కోట్ల షేర్ తో ఐదో స్థానంలో ఉంది.
ఈ ఏడాది రిలీజ్ అయిన హనుమాన్ సినిమా వండర్స్ క్రియేట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకి పైగా కలెక్ట్ చేస్తే తెలుగు రాష్ట్రాలలో 89.50 కోట్ల షేర్ ని సొంతం చేసుకొని టాప్ 10 జాబితాలోకి వచ్చి చేరింది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం ఏవరేజ్ టాక్ తో కూడా 90.53 కోట్ల షేర్ సొంతం చేసుకోవడం ద్వారా టాప్ 10 జాబితాలోకి చేరింది.
ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో హైయెస్ట్ షేర్ వసూళ్లు చేసిన టాప్ 10 సినిమాల జాబితా చూసుకుంటే ఇలా ఉంది.
ఆర్ఆర్ఆర్ - 272.31Cr
బాహుబలి 2 - 204Cr
సలార్ - 150.73Cr****
అల వైకుంఠపురంలో - 130.17Cr
సరిలేరు నీకెవ్వరూ - 117.50Cr
వాల్తేరు వీరయ్య - 115.10Cr
బాహుబలి -: 114Cr
సైరా నరసింహారెడ్డి - 106.4Cr
రంగస్థలం - 95.27Cr
గుంటూరు కారం - 90.53Cr*****
సర్కారువారిపాట – 90.07Cr
హనుమాన్ 89.50Cr~********
ఆదిపురుష్ - 86.25Cr
పుష్ప - 85.35Cr