హాయ్ నాన్న బాక్సాఫీస్.. ఓ పనైపోయింది
నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జోడీగా శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం హాయ్ నాన్న
By: Tupaki Desk | 17 Dec 2023 8:45 AM GMTనేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జోడీగా శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం హాయ్ నాన్న. ఫీల్ గుడ్ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని ఆవిష్కరించారు. క్రిస్మస్ కానుకగా వచ్చిన మూవీకి మొదటి రోజే పాజిటివ్ టాక్ వచ్చింది జెర్సీ తర్వాత అలాంటి ఎమోషన్స్ తో తండ్రి, కూతుళ్ళ రిలేషన్, బాండింగ్ నేపథ్యంలో కొత్త దర్శకుడు శౌర్యువ్ కథని చెప్పారు.
రెగ్యులర్ కథ అయిన చెప్పే విధానం కొత్తగా మనస్సుకి హత్తుకునే విధంగా ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ కి భాగా కనెక్ట్ అయ్యింది. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్లి చూడగలిగే సినిమా అనే పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. దీంతో డీసెంట్ కలెక్షన్స్ తో పది రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అందుకొని ఈ ఏడాది నాని ఖాతాలో సెకండ్ హిట్ బొమ్మగా చేరింది.
దసరా సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమాకి తక్కువ బిజినెస్ జరిగింది. క్లాస్ టచ్ ఉన్న స్టొరీ కావడంతో డిస్టిబ్యూటర్స్ ఎక్కువ మొత్తం పెట్టలేదు. దీంతో 28.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో హాయ్ నాన్న థియేటర్స్ లోకి వచ్చింది. నాని మార్కెట్ లెక్కల ప్రకారం చూసుకుంటే ఇది పెద్ద మొత్తం అయితే కాదు. కానీ సినిమా మాస్ ఆడియన్స్ కి రీచ్ అయ్యే సబ్జెక్ట్ కాకపోవడంతో బ్రేక్ ఈవెన్ అందుకోవడం కాస్తా లేట్ అయ్యింది.
తెలుగు రాష్ట్రాలలో పది రోజుల్లో 18.24 కోట్ల షేర్ ని హాయ్ నాన్న అందుకుంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.48 కోట్లు వసూళ్లు అయ్యింది. ఓవర్సీస్ లో 7.82 షేర్ కలెక్ట్ అయ్యింది. ఓవరాల్ గా 29.54 కోట్లు షేర్ పది రోజుల్లో హాయ్ నాన్న సినిమా కలెక్ట్ చేసింది. దీంతో ప్రాఫిట్ లోకి వచ్చి క్లీన్ హిట్ గా నిలిచింది.
సలార్ రిలీజ్ వరకు ఇంకా మూవీ థియేటర్స్ లో కొనసాగే అవకాశం ఉంది. ఈ వీకెండ్ కలెక్షన్స్ పెరిగితే మరింత ప్రాఫిట్ అందుకొని బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం టైటిల్ తో డిఫరెంట్ కంటెంట్ మూవీ చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న రెండో సినిమా ఇది కావడం విశేషం.