హాయ్ నాన్న.. ఎంత కాన్ఫిడెన్స్ అంటే..
జెర్సీలో ఫాదర్‌గా హృదాయన్ని హత్తుకునే ఎమోషన్స్‌ను కనబరిచి ఆకట్టుకున్న నాని హాయ్ నాన్నలోనూ అలాంటి భావోద్వేగాలని కనబరుస్తారని అంతా అనుకుంటున్నారు.
By: Tupaki Desk | 25 Oct 2023 5:39 AM GMTఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి చిన్న, మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలతోనే మంచి ఫలితాలందుకుని.. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగిన హీరో నేచురల్ స్టార్ నాని. ప్రస్తుతం ఆయన డిఫరెంట్ జానర్స్‌లో వరుస సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. అలా ఈ ఏడాది దసరాతో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న ఆయన ఇప్పుడు హాయ్ నాన్నగా రాబోతున్నారు. ఊర మాస్ వంటి చిత్రం తర్వాత క్లాస్ ఎమోషన్‌తో వస్తున్నారు.
అయితే ఈ చిత్ర విషయంలో హీరో నాని ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ ఆయన ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తోంది. సినిమా ఫైనల్ ఎడిట్ కాపీని తాను చూసినట్లు చెప్పిన నాని.. సినిమా అద్భుతంగా వచ్చిందని పేర్కొన్నారు.
"దసరా పండగ రోజు ఫైనల్ ఎడిట్ కాపీని చూశాను. సినిమా బాగా వచ్చింది. ఓ అందమైన ప్రేమ కథ కోసం మీరు ఎదురుచూస్తున్నారా? అయితే డిసెంబర్ 7న మీరూ చూసేయండి" అంటూ నాని ట్వీట్ రాసుకొచ్చారు. ఈ ట్వీట్ సినిమా పట్ల ఆయన ఎంత నమ్మకంగా ఉన్నారో కన్వే చేస్తోంది.
కాగా, జెర్సీ సినిమా తర్వాత మరోసారి నాని తండ్రి పాత్రలో కనిపించబోతున్నారు. జెర్సీలో ఫాదర్‌గా హృదాయన్ని హత్తుకునే ఎమోషన్స్‌ను కనబరిచి ఆకట్టుకున్న నాని హాయ్ నాన్నలోనూ అలాంటి భావోద్వేగాలని కనబరుస్తారని అంతా అనుకుంటున్నారు. శౌర్యువ్ దర్శకత్వంలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా ఈ సినిమా తెరకెక్కింది. నానితో పాటు పాప సెంటిమెంట్ సినిమాలో కీలక పాత్ర పోషించనుంది.
సింపుల్ కాన్సెప్ట్‌తో హాయిగా అనిపించే ఎమోషనల్ విజువల్స్‌తో దర్శకుడు శౌర్యువ్ హాయ్ నాన్నని తీర్చిదిద్దినట్టు ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. హేషమ్ అబ్దుల్ వాహబ్ అందించిన మ్యూజిక్ బాగుంది. వైరా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ సినిమాను నిర్మించింది. మరి డిసెంబర్ 7న థియేటర్లలో అడుగుపెట్టబోతున ఈ హాయ్ నాన్నను భావోద్వేగాలతో ప్రేక్షకులను కనెక్ట్ చేయగలిగితే జెర్సీని మించే విజయం దక్కినట్టే!