నాని 'నాన్న' తో సలార్ ఆధ్య రిలేషన్ ఏంటో..!
శృతి హాసన్ పాత్ర ఎలా ఉంటుందో ఏమో కానీ ఈ సినిమాలో ఆమెకు ఒక పాట కూడా ఉంటుందని తెలుస్తోంది.
By: Tupaki Desk | 25 Nov 2023 9:59 AM GMTనాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమా విడుదలకు సిద్ధం అయింది. డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న హాయ్ నాన్న సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటించిన విషయం తెల్సిందే. అయితే ఈ సినిమాలో శృతి హాసన్ కూడా నటించింది అంటూ షూటింగ్ సమయం లోనే యూనిట్ సభ్యులు తెలియజేశారు.
హాయ్ నాన్న సినిమాలో శృతి హాసన్ పాత్ర ఏంటి అనేది ఇన్నాళ్లు పెద్దగా చర్చ జరగలేదు. కానీ ఇప్పుడు హాయ్ నాన్న సినిమా ట్రైలర్ విడుదల అయిన తర్వాత ఈ సినిమాలో శృతి హాసన్ పాత్ర ఏంటి అన్న చర్చ మొదలైంది. ట్రైలర్ చూసిన చాలా మంది కూడా ఈ సినిమాలో శృతి హాసన్ చేసిన పాత్ర కాస్త నెగటివ్ షేడ్స్ తో ఉంటుందేమో అనిపిస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ నాని కి ఆమెకు ఉండే రిలేషన్ ఏమై ఉంటుంది అంటూ ఆసక్తిగా చర్చ జరుగుతోంది.
శృతి హాసన్ పాత్ర ఎలా ఉంటుందో ఏమో కానీ ఈ సినిమాలో ఆమెకు ఒక పాట కూడా ఉంటుందని తెలుస్తోంది. కొన్ని సన్నివేశాలతో పాటు శృతి హాసన్ పాటలో కూడా కనిపించబోతుంది. కనుక ఆమె పాత్ర ఇలా వచ్చి అలా వెళ్ళింది అన్నట్లుగా ఉండక పోవచ్చు అంటున్నారు. ఈ సినిమా తో పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు శృతి హాసన్ మొదటి సారి వెళ్లబోతోంది.
సలార్ సినిమాలో ఆధ్య పాత్రలో శృతి హాసన్ కనిపించబోతుంది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ సినిమా వచ్చే నెలలో విడుదల అవుతుంది. ఒకే నెలలో రెండు పాన్ ఇండియా సినిమాలతో శృతి హాసన్ రాబోతుంది. ఈ రెండు సినిమాలు కూడా ఆమెకు ఎంతో కీలకంగా నిలువబోతున్నాయి.
హాయ్ నాన్న సినిమాలో ఇన్ని రోజులు శృతి హాసన్ పాత్ర గురించి పెద్దగా చర్చ లేదు. అసలు సినిమాకు ఆమెకు పెద్దగా సంబంధం ఉండదేమో అనుకున్నారు. కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాలో శృతి హాసన్ పాత్ర కూడా చిన్నదేం కాదని తేలడంతో ఆమె ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రెండు పాన్ ఇండియా సినిమాలతో శృతి హాసన్ సత్తా చాటేనా చూడాలి. హాయ్ నాన్న సినిమా పై నాని పెట్టుకున్న ఆశలు, ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చూస్తూ ఉంటే కచ్చితంగా సూపర్ హిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హాయ్ నాన్న సినిమా తో మొదట పాన్ ఇండియా రేంజ్ లో శృతి సందడి చేయబోతుంది. ఆ తర్వాత సలార్ ఆధ్య గా పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటే అవకాశాలు ఉన్నాయి.