Begin typing your search above and press return to search.

యానిమాల్ మింగేస్తోంది నాని.. గట్టిగా కొట్టాల్సిందే.

హీరోయిన్ మృణాల్ ఏమైనా సపోర్ట్ చేస్తుందేమో అనుకుంటే ఆమె మిగతా షూటింగ్స్ లలో బిజీగా ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్ కు టైమ్ కేటాయించలేకపోతోంది.

By:  Tupaki Desk   |   28 Nov 2023 9:08 AM GMT
యానిమాల్ మింగేస్తోంది నాని.. గట్టిగా కొట్టాల్సిందే.
X

నేచురల్ స్టార్ నాని హాయ్ నాన్న సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు. దసరా లాంటి మాస్ హై వోల్టేజ్ యాక్షన్ సినిమా అనంతరం ఇలాంటి ఎమోషనల్ డెప్త్ ఉన్న సినిమాను టచ్ చేస్తున్నాడు అంటే అందులో కంటెంట్ ను ఎంత బలంగా నమ్మాడో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ సినిమా ప్రమోషన్ విషయంలో కూడా నేచురల్ స్టార్ సోలోగానే పోరాడుతున్నాడు.

హీరోయిన్ మృణాల్ ఏమైనా సపోర్ట్ చేస్తుందేమో అనుకుంటే ఆమె మిగతా షూటింగ్స్ లలో బిజీగా ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్ కు టైమ్ కేటాయించలేకపోతోంది. కానీ నాని మాత్రం హాయ్ నాన్నను లేపడం కోసం అన్ని రకాల ప్రయోగాలు చేస్తున్నాడు. ఎమోషనల్ ఫన్ అంటూ అన్ని రకాల ప్రమోషన్స్ తో ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.

ప్రస్తుత ఎలక్షన్ ఫీవర్ ను కూడా హాయ్ నాన్న పార్టీ అంటూ గట్టిగానే వాడుకున్నాడు. కేసీఆర్ రాహుల్ ఫన్నీ వీడియో కూడా బాగా వైరాల్ అయ్యింది. అలాగే ఇదివరకే వచ్చిన సాంగ్స్ తో పాటు టీజర్ ట్రైలర్ కూడా సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. సినిమా కంటెంట్ కంటే ఎక్కువగా నాని ప్రమోషన్స్ ట్రిక్స్ బాగా హైలెట్ అయ్యాయి. అయితే అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో యానిమాల్ ట్రైలర్ ఒక్కసారిగా హాయ్ నాన్న బజ్ ను మింగేసింది.

ప్రస్తుతం ఆ సినిమాకు ఏ రేంజ్ లో హైప్ క్రియేట్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్రైలర్ అనంతరం మరింత బూస్ట్ వచ్చేలా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. మహేష్ బాబు, రాజమౌళి రాకతో సినిమాకు ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయిలో హైప్ ఎక్కేసింది. ఇక యానిమాల్ బజ్ గట్టిగా ఉండడంతో నాని హాయ్ నాన్న సౌండ్ చాలా వరకు తగ్గింది. నిన్న మొన్నటి వరకు ఉన్న సౌండ్ కూడా ఇప్పుడు యానిమాల్ ముందు వినిపంచడం లేదు.

ఇది సినిమాకు చాలా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. డిసెంబర్ 1న యానిమాల్ వచ్చిన తరువాత డిసెంబర్ 7న హాయ్ నాన్న రాబోతోంది. ఒక వారం గ్యాప్ ఉండడం మంచిదే కానీ యానిమాల్ ఇప్పుడు ఉన్న బజ్ కు ఏమాత్రం పాజిటివ్ టాక్ అందుకున్నా కూడా బాక్సాఫీస్ వద్ద కూడా ప్రభావం చూపించకుండా ఉండదు. ఎందుకంటే ముందు వారం ఒక సినిమా చూసి మళ్ళీ నెక్స్ట్ వీక్ మరో సినిమా ఏం చూస్తాములే అనుకునే వారు కూడా ఉంటారు.

కాబట్టి నాని అలాంటి ఆలోచన రాకుండా ఆడియెన్స్ ను తనవైపు తిప్పుకోవాలి. ఏది ఏమైనా నాని ఇప్పుడు ప్రమోషన్స్ తో యానిమాల్ కు ధీటుగా సౌండ్ పెంచాల్సిన అవసరం ఉంది. లోకల్ గా పట్టున్నా కూడా బాలీవుడ్ హీరో సినిమాకు ధీటుగా ఉండకపోవడం అనేది షాకింగ్ అనే చెప్పాలి. ఇక నాని మళ్ళీ హైప్ వచ్చేలా ప్రమోషన్స్ విషయంలో ఇంకాస్త గట్టిగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది.