Begin typing your search above and press return to search.

హాయ్ నాన్న ఖాతాలో ప్రెస్టిజియస్ అవార్డ్..!

న్యాచురల్ స్టార్ నాని లీడ్ రోల్ లో నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా హాయ్ నాన్న

By:  Tupaki Desk   |   6 April 2024 12:26 PM GMT
హాయ్ నాన్న ఖాతాలో ప్రెస్టిజియస్ అవార్డ్..!
X

న్యాచురల్ స్టార్ నాని లీడ్ రోల్ లో నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా హాయ్ నాన్న. వైరా క్రియేషన్స్ బ్యానర్ మొదటి సినిమాగా రూపొందిన ఈ సినిమా లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ తర్వాత గ్లోబల్ వైడ్ గా కూడా సినిమా ఆడియన్స్ ను అలరించింది. హాయ్ నాన్న సినిమాను ఇంటర్నేషనల్ ఆడియన్స్ కోసం హాయ్ డాడీగా రిలీజ్ చేశారు. నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్న ఈ సినిమా చూసి ఇంటర్నేషనల్ ఆడియన్స్ కూడా ఇంప్రెస్ అయ్యారు.

నాని హాయ్ నాన్న కమర్షియల్ సక్సెస్ అందుకోవడమే కాదు ఎంతోమంది ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఎథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ ఫిల్మ్ అవార్డును కైవసం చేసుకుంది. ఎథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ మార్చి 2024 ఎడిషన్ లో నాని హాయ్ నాన్న అదే హాయ్ డాడీ సినిమా బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా నిలిచింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.

అద్భుతమైన కథ, ఆకట్టుకునే కథనం తో ప్రేక్షకుల మెప్పు పొందిన హాయ్ నాన్న ఇప్పుడు ఎథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీని ఆకర్షించింది. ఇంటర్నేషనల్ లెవెల్ లో మా సినిమాకు వచ్చిన ఈ గుర్తింపు వల్ల మరింత మంచి సినిమాలను చేయాలనే ఉత్సాహం వస్తుందని అన్నారు హాయ్ నాన్న మేకర్స్.

ఎథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో హాయ్ నాన్నకు అవార్డ్ రావడం సంతోషంగా ఉందని అన్నారు డైరెక్టర్ శౌర్యువ్. తనకు ఈ సినిమా ఎంతో గౌరవాన్ని, గుర్తింపును తెచ్చింది. దీనికి కారణమైన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మనం తీసిన సినిమా బాగుంటే అది బౌండరీస్ దాటి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తుందని మరోసారి ఈ సినిమా ప్రూవ్ చేసిందని అన్నారు. ఈ అవార్డుని అందించిన జ్యూరీకి, హాయ్ నాన్న సినిమాకు ప్రాణం పోసిన నటులకు పనిచేసిన టీం అందరికీ థాంక్స్ చెప్పారు శౌర్యువ్.

కోట్ల కొద్దీ బడ్జెట్ పెట్టి భారీ తనంతో చేస్తున్న సినిమాలే కాదు మంచి కంటెంట్ తో వస్తున్న తెలుగు సినిమాలు కూడా గ్లోబల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. టాలీవుడ్ లో కొత్త దర్శకులు చెబుతున్న సరికొత్త స్టోరీ టెల్లింగ్ కి ఇంటర్నేషనల్ లెవెల్ లో ప్రశంసలు దక్కుతున్నాయి. హాయ్ నాన్న ఇంటర్నేషనల్ అవార్డు దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.