Begin typing your search above and press return to search.

నాని సినిమాకు.. మొత్తం లాభం ఎంతంటే..

ఈ సినిమాకి థర్డ్ వీక్ లో వరుసగా వీకెండ్స్ తో పాటు క్రిస్మస్ డే సెలవులు దొరకడంతో ఫ్యామిలీ ఆడియన్స్ హాయ్ నాన్న మూవీ చూడటానికి థియేటర్స్ కి తరలి వెళ్లారు.

By:  Tupaki Desk   |   26 Dec 2023 7:07 AM GMT
నాని సినిమాకు.. మొత్తం లాభం ఎంతంటే..
X

నేచురల్ స్టార్ నాని హీరోగా శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం హాయ్ నాన్న. ఈ మూవీ రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువ అయిపొయింది. దసరా తర్వాత ఈ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని నాని తన ఖాతాలో వేసుకున్నారు.

మృణాల్ ఠాకూర్ కి తెలుగులో ఇది రెండో అతి పెద్ద హిట్ అని చెప్పాలి. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టిన ఈ ముద్దుగుమ్మ హాయ్ నాన్నతో మరోసారి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. నాని, మృణాల్ జోడీకి ఈ మూవీలో మంచి మార్కులు పడ్డాయి. ఇదిలా ఉంటే ఈ మూవీ రిలీజ్ అయ్యి 19 రోజులు పూర్తి చేసుకుంది.

ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 68.05 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకి థర్డ్ వీక్ లో వరుసగా వీకెండ్స్ తో పాటు క్రిస్మస్ డే సెలవులు దొరకడంతో ఫ్యామిలీ ఆడియన్స్ హాయ్ నాన్న మూవీ చూడటానికి థియేటర్స్ కి తరలి వెళ్లారు. దీంతో మూడు రోజులు డీసెంట్ షేర్ ని ఈ చిత్రం కలెక్ట్ చేసింది.

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 28.50 కోట్ల బ్రేక్ ఈవెన్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ టార్గెట్ ని ఇప్పటికే అందుకోవడంతో పాటు అదనంగా 7.25 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకొని షేర్ పరంగా చూసుకుంటే 35.75 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది. ఇప్పటికి థియేటర్స్ లో మూవీ కొనసాగుతోంది. సలార్ మూవీ 18 ఏళ్ళ లోపు వారిని అనుమతించకపోవడంతో ప్రత్యామ్నాయంగా ఉన్న హాయ్ నాన్న వైపు ఫ్యామిలీ అందరూ మొగ్గు చూపిస్తున్నారు.

ఈ కారణంగానే కలెక్షన్స్ పెరుగుతున్నాయి. లాంగ్ రన్ లో మరో రెండు, మూడు కోట్ల వరకు ప్రాఫిట్ ని ఈ చిత్రం సొంతం చేసుకునే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. మొత్తానికి ఈ ఏడాది రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ నాని తన ఖాతాలో వేసుకున్నట్లే.