హాయ్ నాన్న బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే
ఇదిలా ఉంటే ఈ సినిమా ఫాదర్ సెంటిమెంట్ తో తెరకెక్కడం వలన కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి రీచ్ అయ్యే అవకాశం ఉంది.
By: Tupaki Desk | 30 Nov 2023 4:55 AM GMTనేచురల్ స్టార్ నాని హీరోగా శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వస్తోన్న చిత్రం హాయ్ నాన్న. ఈ మూవీ డిసెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషలలో రిలీజ్ అవుతోంది. దసరా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నాని నుంచి రాబోతున్న మరో పాన్ ఇండియా మూవీ హాయ్ నాన్న కావడం విశేషం. ఇదిలా ఉంటే ఈ సినిమా ఫాదర్ సెంటిమెంట్ తో తెరకెక్కడం వలన కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి రీచ్ అయ్యే అవకాశం ఉంది.
ఈ సినిమా ప్రమోషన్ యాక్టివిటీస్ అన్ని నాని దగ్గరుండి చూసుకుంటున్నారు. కచ్చితంగా ప్రేక్షకులని ఈ మూవీ ఆకట్టుకుంటుంది అనే నమ్మకంతో చిత్ర యూనిట్ ఉంది. ఇదిలా ఉంటే హాయ్ నాన్న దాదాపు 30 కోట్ల వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని తెలుస్తోంది. దసరా తర్వాత హైయెస్ట్ బిజినెస్ ఈ సినిమాపైనే జరగడం విశేషం.
నైజాం రిలీజ్ రైట్స్ 9 కోట్లకి అమ్ముడయ్యాయి. సీడెడ్ 2.8 కోట్లు, ఉత్తరంద్ర 2.7 కోట్లు, గుంటూరు 1.8 కోట్లు
తూర్పు గోదావరి 1.6 కోట్లు, పశ్చిమం : 1.4 కోట్ల, కృష్ణా : 1.5 కోట్లు, నెల్లూరు : 0.8 కోట్లు బిజినెస్ జరిగింది. ఇవి కాకుండా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం 2 కోట్ల వ్యాపారం జరగగా ఓవర్సీస్ లో ఆరు కోట్లకి రైట్స్ సొల్ద్ అవుట్ అయ్యాయి. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ 29.6 కోట్ల బిజినెస్ హాయ్ నాన్న సినిమాపైన జరిగింది.
ఈ లెక్కల ప్రకారం బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే 30 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సినిమాకి ఉన్న హైప్ కారణంగా మ్ ఒదటి రోజు ఓపెనింగ్స్ అయితే భాగానే వచ్చే అవకాశం ఉంది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే మాత్రం తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ తాకిడి పెరిగే ఛాన్స్ ఉంటుంది.
అప్పుడు ఆటోమేటిక్ గా కలెక్షన్స్ పెరుగుతాయి. ఈ సినిమాకి సెన్సార్ క్లీన్ యు సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమా రన్ టైం 155 నిమిషాలు ఉందని తెలుస్తోంది. మృణాల్ ఠాకూర్ మెయిన్ హీరోయిన్ గా నటించగా, శృతి హాసన్ కూడా ఓ కీలక పాత్రలో మూవీలో కనిపించబోతోంది.