Begin typing your search above and press return to search.

ఈ వారం పరిస్థితి ఎలా ఉంది అంటే?

రెండు సినిమాలు కూడా వేటికవే భిన్నంగా ఉండడంతో ఈవారం బాక్స్ ఆఫీస్ వద్ద సందడి గట్టిగానే కనిపించే అవకాశం ఉంది.

By:  Tupaki Desk   |   6 Dec 2023 7:20 AM GMT
ఈ వారం పరిస్థితి ఎలా ఉంది అంటే?
X

నేచురల్ స్టార్ నాని హాయ్ నాన్న సినిమాతో పాటు నితిన్ నటించిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్.. సినిమలు ఈ వారంలోని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా డిఫరెంట్ గా కాంటెంట్ తో ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. హాయ్ నాన్న సినిమాలో కూతురు తండ్రి ఎమోషన్ హైలెట్ కానుంది. ఇక నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ సినిమా మాత్రం యూత్ ఫుల్ కమర్షియల్ ఎంటర్టైన్ గా రాబోతోంది.

రెండు సినిమాలు కూడా వేటికవే భిన్నంగా ఉండడంతో ఈవారం బాక్స్ ఆఫీస్ వద్ద సందడి గట్టిగానే కనిపించే అవకాశం ఉంది. ఇక ఇద్దరు హీరోలు వారి సినిమాలపై హైప్ పెంచేందుకు గట్టిగానే ప్రమోషన్స్ కూడా చేస్తూ ఉన్నారు. రెగ్యులర్ గా కాకుండా ఫన్నీగా కూడా మరికొన్ని ఇంటర్వ్యూలు విడుదల చేస్తూ ఉండడం సినిమాలకు చాలా ప్లస్ అవుతుంది.

ఇక హాయ్ నాన్న సినిమా డిసెంబర్ 7న విడుదలవుతుండగా ఆ తర్వాత రోజు నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ సినిమా విడుదల కాబోతోంది. దాదాపు రెండు సినిమాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో సమానమైన థియేటర్స్ లభించాయి. అంతేకాకుండా ఇంచుమించు బిజినెస్ కూడా ఒకే రేంజ్ లో జరిగినట్లుగా తెలుస్తోంది. నాని హాయ్ మాత్రం మిగతా భాషల్లో కూడా విడుదలవుతోంది.

ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ సినిమాలకు సంబంధించిన టికెట్ రేట్లు ఎలా ఉన్నాయి అన్స్ వివరాలలోకి వెళితే.. ముందుగా తెలంగాణలోని సింగిల్ స్క్రీన్స్ లలో అత్యధికంగా 175 రూపాయల వరకు ఉండగా మల్టీప్లెక్స్ లలో అత్యధికంగా టికెట్ ధర 295 వరకు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఏపీలో చూసుకుంటే ఎప్పటిలాగే గవర్నమెంట్ పర్మిటెడ్ రేట్లు కేటాయించారు. సింగిల్ స్క్రీన్స్ లలో 145 రూపాయలు మల్టీప్లెక్స్ లలో అత్యధికంగా 177 రూపాయల రేంజ్ లో టికెట్ రేట్లు ఉన్నాయి.

మరి ఈ రేట్లతో ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ సొంతం చేసుకుంటాయో చూడాలి. దసరా సినిమాతో నాని బాక్సాఫీస్ వద్ద ఏకంగా 100 కోట్ల కలెక్షన్స్ మొదటిసారి చూశాడు. ఇక హాయ్ నాన్న సినిమా ఆ సినిమా కంటే విభిన్నంగా కంప్లీట్ ఎమోషనల్ గా రాబోతోంది. ఇక ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుంది అనేది విడుదల తర్వాత తెలుస్తుంది. మరోవైపు నితిన్ ఎక్స్ ట్రా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని చిత్ర యూనిట్ నమ్ముతోంది. మరి అంచనాలకు తగ్గట్టుగా కంటెంట్ క్లిక్ అవుతుందో లేదో.