సౌత్ లో సత్తా చాటాలంటే ఇక్కడికి రావాల్సిందే!
హిందీ సినిమాలను సౌత్ ఆడియన్స్ చూడరు? కానీ మా హిందీ ఆడియన్స్ సౌత్ సినిమాలు చూస్తారని సల్మాన్ ఖాన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 29 March 2025 5:47 AMహిందీ సినిమాలను సౌత్ ఆడియన్స్ చూడరు? కానీ మా హిందీ ఆడియన్స్ సౌత్ సినిమాలు చూస్తారని సల్మాన్ ఖాన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అలా హిందీ సినిమా సౌత్ లో చూడక పోవడానికి గల కారణాలు ఇప్పటికే కొన్ని తెరపైకి వచ్చాయి. సౌత్ లో హిందీ సినిమాని సరిగ్గా ప్రచారం చేయక పోవడం.. .సవ్యంగా మాతృ భాషలో రిలీజ్ చేయకపోవడం వంటి కారణాలు హిందీ సినిమా సౌత్ లో వెనుకబడింది అన్నది ఓ కారణంగా హైలైట్ అయింది.
ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ ముందుకు హిందీ సినిమాలు రావడం లేదు. వచ్చినా? అవి ఒకటి రెండు మెట్రో పాలిటన్ సిటీస్ లో కొన్ని థియేటర్లకు మాత్రమే పరిమితమవుతున్నాయి. దీంతో ఎప్పుడు ఏహిందీ సినిమా రిలీజ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితితే. దీన్ని అధిగమించాలి అంటే బాలీవుడ్ టాప్ స్టార్స్ చిత్రాలన్ని తెలుగులో అనువాదమైన వాటికి మంచి రిలీజ్ దొరికేలా ప్లాన్ చేస్తే మంచి ఫలితాలు అందు కునే అవకాశం ఉంటుంది.
దీన్ని మించి హిందీ హీరోలు సౌత్ లో మార్కెట్ బిల్డ్ చేసుకోవాలంటే మరో అద్భుతమైన ఉపాయం ఉంది. హిందీ హీరోలు సౌత్ భాషల్లో ఇతర హీరోలతో కలిసి సినిమాలు చేస్తే మార్కెట్ పరంగా కలిసొస్తుంది. ఆ రకంగా హిందీ హీరోలు సౌత్ ఆడియన్స్ కి దగ్గరైనట్లు ఉంటుంది. ఇప్పటికే ఈ స్ట్రాటజీని అమీర్ ఖాన్ అప్లై చేస్తున్నాడు. రజనీకాంత్ హీరోగా నటిస్తోన్న `కూలీ` చిత్రంలో అమీర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.గెస్ట్ పాత్రలు కాకుండా కీలక పాత్రలు పోషిస్తే మంచి ఐడెంటిటీ దక్కుతుంది.
నేడు మోహన్ లాల్, పృధ్వీరాజ్ సుకుమారన్ సినిమాలకు తెలుగులోనూ గిరాకీ ఉందంటే కారణం వాళ్లు తెలుగు సినిమాల్లో నటించడంతోనే సాధ్యమైంది. అదే సమయంలో మలయాళంలో తెరకెక్కించిన సినిమాలు ఏక కాలంలో ఇక్కడా రిలీజ్ చేసుకుంటున్నారు. సరైన కంటెంట్ ఉన్న చిత్రాల్ని తెలుగు ఆడియన్స్ నెత్తిన పెట్టు కుంటారని ఎప్పటి కప్పుడు ప్రూవ్ అవుతూనే ఉంది.
వీళ్లందరికంటే ముందు షారుక్ ఖాన్ `చెన్నై ఎక్స్ ప్రెస్` లో? తమిళనాడు లుంగీ సెంటిమెంట్ ని వాడుకుని కోట్లు కొల్లగొట్టాడు. ఆ సినిమాతో కోలీవుడ్ లో షారుక్ ఖాన్ కి ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడింది. సల్మాన్ ఖాన్ సహా ఇతర హీరోలు ఇలాంటి స్ట్రాటజీలు అప్లై చేయడం లేదు. అందుకే సౌత్ మార్కెట్ రేసులో బాగా వెనుకబడి ఉన్నారు.