పార్ట్ 3కి పర్ఫెక్ట్ లీడ్..!
పుష్ప రాజ్ పాత్రకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు కాబట్టి దాన్ని ఇంకో రెండు భాగాలు తీసినా ఆదరిస్తారు.
By: Tupaki Desk | 29 Nov 2024 6:30 PM GMTపుష్ప సెట్స్ మీద ఉన్నప్పుడు ఒక సినిమాగానే తెరకెక్కించాలని అనుకున్నాడు సుకుమార్. ఐతే పుష్ప రాజ్ పాత్ర బాగా రావడం ఎమోషన్ బాగా వర్క్ అవుట్ అవుతుంది అన్న నమ్మకంతో సినిమాను మధ్యలోనే ఎండ్ కార్డ్ వేసి పుష్ప 2 ఉందని చెప్పారు. ఐతే ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ అవుతున్న ఈ టైం లో పుష్ప 2 కాదు పార్ట్ 3 గురించి కూడా చర్చ మొదలైంది. పుష్ప 2 మాత్రమే కాదు పుష్ప 3 కూడా ఉంటుందన్న విషయం తెలిసిందే. పుష్ప రాజ్ పాత్రకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు కాబట్టి దాన్ని ఇంకో రెండు భాగాలు తీసినా ఆదరిస్తారు.
పుష్ప 1 ని ఎస్పీ భన్వర్ సింగ్ షెఖావత్ వచ్చి తన బ్రాండ్ గురించి అడిగి అవమానించడంతో అతనితో ఫ్రెండ్ షిప్ చేసి తన రక్తాన్ని చూపించి ఇది సార్ నా బ్రాండ్ అని ఎస్పీకి జలక్ ఇచ్చాడు పుష్ప రాజ్. దాంతో పుష్ప 1 ముగుస్తుంది. పుష్ప 2 కి అదే లీడ్ అవుతుంది. ఐతే పార్ట్ 2 లో తన శత్రువులతో పాటు ఎస్పీ నుంచి కూడా పుష్ప రాజ్ మీద ఎటాక్ ఉంటుంది.
ఐతే పుష్ప 2 ముగింపులో పార్ట్ 3 లీడ్ కూడా అదిరిపోతుందని టాక్. సెన్సార్ అయిపోయి సినిమా చూసిన కొందరు సెలబ్రిటీస్ దీనిపై ఆసక్తికరంగా చెబుతున్నారు. పుష్ప 2 ఎండ్ కార్డ్ అదే పుష్ప 3 కి ఇచ్చే లీడ్ ఒక రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. పుష్ప 2 క్లైమాక్స్ లో భాగంగానే ఆ లీడ్ ఉంటుందని ఇది ఆడియన్స్ ని సీట్లలో కూర్చోనివ్వదని అంటున్నారు.
అసలే పుష్ప రాజ్ మేనియాలో నేషనల్ లెవెల్ గా ఆడియన్స్ అంతా ఊగిపోతున్న ఈ టైం లో పుష్ప 3 గురించి వచ్చిన ఈ అప్డేట్ తో పుష్ప ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. పుష్ప 3 సినిమా కథ ఎలా టర్న్ తీసుకుంటుంది. అసలు సుకుమార్ ఏం చేయబోతున్నాడు అన్నది తెలియాల్సి ఉంది. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా నేషనల్ లెవెల్ లో చిత్ర యూనిట్ చేస్తున్న ప్రమోషన్స్ అన్నీ కూడా ప్రేక్షకులకు సినిమాపై మరింత బజ్ పెరిగేలా చేస్తున్నాయి.
పుష్ప 2 సినిమా పాన్ ఇండియా లెవెల్ లో 10 వేల థియేటర్స్ కి పైగా రిలీజ్ అవుతుంది. సినిమాపై ఉన్న బజ్ చూస్తుంటే ఫస్ట్ డే రికార్డ్ వసూళ్లు రాబట్టేలా ఉంది. సినిమా అంచనాలు రీచ్ అయితే 1000 కోట్లు కలెక్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.