Begin typing your search above and press return to search.

మ్యూజిక్ డైరెక్టర్ కొత్త మూవీ.. గ్లింప్స్ సో ఇంట్రెస్టింగ్..

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో హిప్ హాప్ తమిళ్ వరుస సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 July 2024 7:28 AM GMT
మ్యూజిక్ డైరెక్టర్ కొత్త మూవీ.. గ్లింప్స్ సో ఇంట్రెస్టింగ్..
X

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో హిప్ హాప్ తమిళ్ వరుస సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అటు మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి పాటలు అందిస్తూనే.. ఇటు హీరోగా చిత్రాలు చేస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన పీటీ సర్ మూవీ.. థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. యంగ్ బ్యూటీ అనికా సురేంద్రన్ హీరోయిన్ గా నటించిన ఆ సినిమా.. స్పోర్ట్స్ డ్రామాగా రూపొంది సినీ ప్రియులను ఆకట్టుకుంది.

ప్రస్తుతం హిప్ హాప్ తమిళ్ ఆది.. కడైసి ఉలగా పోర్ మూవీ చేస్తున్నారు. ఆ సినిమాకు దర్శకుడిగా, మ్యూజిక్ కంపోజర్ గా, గేయ రచయితగా, ప్రొడ్యూసర్ గా ఆయనే వ్యవహరిస్తుండడం గమనార్హం. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ నుంచి రీసెంట్ గా క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ గ్లింప్స్.. సోషల్ మీడియాలో సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంటోంది. సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తోంది.

శ్రీలంక సివిల్ వార్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతున్నట్లు గ్లింప్స్ ద్వారా తెలుస్తుంది. రాజకీయ, జాతి ఉద్రిక్తతలకు ఆజ్యం పోసిన ప్రాదేశిక సంఘర్షణ చుట్టూ మూవీ తిరుగుతున్నట్లు అర్థమవుతుంది. కాల్పులు, బాంబు దాడుల కారణంగా ఓ ప్రాంతం అల్లకల్లోలంగా మారుతుంది. దీంతో కొంతమంది తమ వస్తువులు తీసుకుని బాధగా వెళ్తూ కనిపిస్తారు. కుప్పకూలిన బిల్డింగ్స్, చెల్లాచెదురుగా పడిన శవాలతో ఆ ప్రాంతం భయానకంగా ఉంటుంది.

అదే సమయంలో నాజర్ తనను దక్షిణ ప్రావిన్స్‌ కు ప్రధానమంత్రిగా నియమించారనే డైలాగ్ తో టీజర్ మలుపు తిరుగుతుంది. అప్పుడు అక్కడి వారంతా పోరాటం మొదలు పెడతారు. మిలిటెంట్లు యుద్ధాన్ని ప్రారంభించి ఆ ప్రాంతాన్ని ఇంకాస్త అల్లకల్లోలంగా మార్చేస్తారు. ఇంతలో హీరోయిన్.. తమిళ్ నా కోసం కచ్చితంగా వస్తాడని అంటుంది. టీజర్ లో విజువల్స్ అదిరిపోయాయి. యుద్ధం జరిగిన ప్రాంతాన్ని చాలా నేచురల్ గా చూపించారు మేకర్స్. పెద్ద ఎత్తున సినిమా కోసం అంతా కష్టపడ్డట్లు అర్థమవుతోంది.

సినిమాలో తమిళ్ ఆదితోపాటు నట్టీ, అనఘ, ఎన్ అలగన్ పెరుమాళ్, హరీష్ ఉత్తమన్, మునిష్కాంత్, సింగం పులి, కళ్యాణ్ మాస్టర్, ఎలాంగో కుమారవేల్, తలైవాస్ విజయ్, మహానటి శంకర్, ఎలాంగో కుమనన్, వినోద్ జీడీ, గుహన్ ప్రకాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా అర్జున్ రాజా, ఎడిటర్ గా ప్రదీప్ రాఘవ్, ఆర్ట్ డైరెక్టర్ గా ఆర్కే నాగు, స్టంట్ డైరెక్టర్ గా మహేష్ మాథ్యూస్ వ్యవహరించనున్నారు.