హిరాణీ Vs నీల్.. ఆడియెన్స్ ఓటు ఎవరికి?
ముందుగా షారుక్ డంకీ సినిమాతో డిసెంబర్ 21న ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. సరిగ్గా ఒక్క రోజు గ్యాప్లో ప్రభాస్ సలార్ సీజ్ ఫైర్తో థియేటర్స్లోకి వస్తున్నారు.
By: Tupaki Desk | 20 Dec 2023 9:21 AM GMTఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ హీరోస్ లిస్ట్ తీస్తే అందులో ప్రభాస్తో పాటు షారుక్ ఖాన్ పేర్లు టాప్ ప్లేసుల్లో తప్పకుండా ఉంటాయి. ఫ్లాప్, యావరేజ్, హిట్ అనే తేడా లేకుండా కలెక్షన్స్ రాబట్టే ఈ ఇద్దరు హీరోలు డిసెంబర్ 21,22 తేదీల్లో బిగ్ క్లాష్కు రెడీ అవుతున్నారు. ముందుగా షారుక్ డంకీ సినిమాతో డిసెంబర్ 21న ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. సరిగ్గా ఒక్క రోజు గ్యాప్లో ప్రభాస్ సలార్ సీజ్ ఫైర్తో థియేటర్స్లోకి వస్తున్నారు.
అయితే ఈ ఇద్దరు హీరోల సినిమాలు మాములుగా అయితే అసలు ఒక సీజన్లోనే రిలీజ్ కాకూడదు అలాంటిది ఈసారి మాత్రం వెనక్కి తగ్గకుండా విడుదల చేస్తున్నారు. ఏ మూవీకి హిట్ టాక్ వస్తే ఆ సినిమాకే ఆడియన్స్ జై కొడతారు. ఇప్పటికైతే సలార్ ట్రైలర్, డంకీ ట్రైలర్లు బయటకు వచ్చి ఒకటి ఫ్యామిలీ సినిమా ఇంకొకటి యూత్ సినిమాగా పేరు తెచ్చుకున్నాయి. అయితే ఈ రెండు మూవీలు ఓవైపు ప్రభాస్, షారుక్ సినిమాల్లానే కాకుండా ప్రశాంత్ నీల్, రాజ్ కుమార్ హిరాణీ చిత్రాలుగా కూడా ప్రమోట్ అవుతున్నాయి.
కేజీఎఫ్ రెండు భాగాలతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ను క్రియేట్ చేసుకున్నారు. యాక్షన్ సీక్వెన్స్లు, హీరోలకు ఇచ్చే మార్క్ ఎలివేషన్లతో ప్రశాంత్ నీల్ ప్రేక్షకులను ఓ రేంజ్ లో అలరిస్తుంటారు. అలా కొంతమంది దర్శకులకే సాధ్యం అని చెప్పొచ్చు. అయితే ఆయన తెరకెక్కించే సినిమాలన్నీ ఒకేలా కనిపిస్తున్నాయని, సలార్ కూడా అలానే ఉందని చాలా మంది అంటున్నారు. కేజీఎఫ్, సలార్కు ఎలాంటి కనెక్షన్ లేకపోయినప్పటికీ.. కొన్ని పోలికలు ఉన్నాయని చెబుతున్నారు.
ఇప్పటికే కేజీఎఫ్ ప్రపంచాన్ని అభిమానులు చూశారని.. కాబట్టి సలార్లోకూడా అదే ప్రపంచాన్ని చూసేందుకు సిద్ధంగా లేరని కొందరు చెబుతున్నారు. కేవలం యాక్షన్ ప్రియులే కాకుండా సాలిడ్ కంటెంట్ను కోరుకునే వ్యక్తులకు ఆకర్షించేందుకు మూవీలో డ్రామా ఉండాలని అంటున్నారు. అయితే ఎన్ని అనుకున్నా.. ప్రశాంత్ నీల్ తన మార్క్ ఎలివేషన్స్తో ప్రభాస్ ఎలా కనిపిస్తాడని చూడడానికి థియేటర్స్ వచ్చే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు.
మరోవైపు, షారుక్ నటించిన డంకీ మూవీ రాజ్ కుమార్ హిరాణీ సినిమాగానే ఎక్కువ ప్రమోట్ అవుతోంది. గత రెండు దశాబ్దాల్లో రాజ్ కుమార్ హిరాణీ సూపర్ హిట్ చిత్రాలను సినీ పరిశ్రమకు అందించారు. మున్నాభాయ్ సిరీస్, 3 ఇడియట్స్, సంజు వంటి బ్లాక్ బస్టర్లను తెరకెక్కించిన హిరాణీ ఇప్పుడు బాలీవుడ్ బాద్షాతో చేయి కలిపారు.
అయితే హిరాణీ తెరకెక్కించే డ్రామా సీక్వెన్స్ ఉన్న చిత్రాలను ప్రజలు ఇప్పుడు ఓటీటీల్లో చూసేందుకు మొగ్గుచూపుతున్నారు. కేవలం యాక్షన్ చిత్రాలనే థియేటర్లలో చూసేందుకు ఇష్టపడుతున్నారు. మరి ఇప్పుడు హిరాణీ తీసిన ఈ చిత్రాన్ని చూడడానికి ఉత్సాహంతో ప్రజలు థియేటర్లకు వస్తారో లేదో అంచనా వేయడం కాస్త కష్టమేనని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
హిరాణీ తెరకెక్కించిన డంకీ రాకపోయి ఉంటే డిసెంబర్ 22వ తేదీ సలార్ సినిమాదే విజయం అని ఈపాటికి అందరూ డిసైడ్ అయిపోయే వాళ్లు. కాబట్టి ఎంత హీరోల ఇమేజ్తో సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా ఈసారి ఆడియన్స్ను థియేటర్స్కు రప్పిస్తుంది మాత్రం దర్శకుల ఇంపాక్ట్ మాత్రమే. ప్రభాస్ను ప్రశాంత్ నీల్ ఎలా చూపిస్తారు? హిరాణీ సినిమాలో షారుక్ ఎలా నటించారు? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం మరో రెండు రోజుల్లో తెలియనుంది.