Begin typing your search above and press return to search.

విజయ్ VD 12.. ఆ ఎపిసోడ్ కు థియేటర్లు షేకే!

అయితే ఇప్పటికే సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మేకర్స్ చిన్న బ్రేక్ తీసుకున్నట్లు సమాచారం.

By:  Tupaki Desk   |   20 Dec 2024 3:30 PM GMT
విజయ్ VD 12.. ఆ ఎపిసోడ్ కు థియేటర్లు షేకే!
X

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇంటెన్స్ డ్రామాగా తెరకెక్కుతున్న VD 12 మూవీ షూటింగ్.. ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం మేకర్స్.. రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ హీరో ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

2025 మార్చి 28వ తేదీన సినిమాను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఇక విజయ్ లుక్ అయితే ఆడియన్స్ నుంచి వేరే లెవెల్ రెస్పాన్స్ అందుకుంది. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. సినిమాపై ఆసక్తి రేపింది. విధి అతని కోసం ఎదురు చూస్తోందంటూ మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ ఓ రేంజ్ లో క్యూరియాసిటీ పెంచేసింది.

పోస్టర్ లో విజయ్ షాకింగ్ లుక్ లో దర్శనమిచ్చారు. నెవ్వర్ బిఫోర్ మాస్ అవతార్ లో ఇంటెన్స్ గా కనిపించారు. షార్ట్ హెయిర్, ముఖంపై రక్తం కారుతున్న గాయాలతో ఉన్నారు. త్వరలో టైటిల్ తో పాటు సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ రివీల్ చేయనున్నట్లు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

అయితే ఇప్పటికే సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మేకర్స్ చిన్న బ్రేక్ తీసుకున్నట్లు సమాచారం. సంక్రాంతి తర్వాత చిత్రీకరణ మళ్లీ స్టార్ట్ చేయనున్నారట. గోవాలో పది రోజుల పాటు షూటింగ్ చేయనున్నారని వినికిడి. ఆ షెడ్యూల్ లో సినిమాలోని కీలక సన్నివేశాలు షూట్ చేయనున్నారని టాక్.

గోవా షెడ్యూల్ తర్వాత మేకర్స్.. కోల్ కతా వెళ్లనున్నారని ప్రచారం జరుగుతోంది. 7-10 రోజుల వరకు అక్కడ షెడ్యూల్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఆ సమయంలో తీయబోయే ఓ హిస్టారికల్ ఎపిసోడ్.. థియేటర్లను కచ్చితంగా షేక్ చేయనుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది.

దీంతో సినీ ప్రియులు, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. మూవీ కోసం వెయిటింగ్ అని కామెంట్లు పెడుతున్నారు. అప్డేట్స్ ఇవ్వండని కోరుతున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్‌ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సినిమాకు గాను టాలెంటెడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. మరి VD 12 మూవీ ఎలా ఉంటుందో వేచి చూడాలి.