నాని ఊచకోత.. ఈసారి రాజుగారికి కలిసొచ్చేనా?
నాని హీరోగా తెరకెక్కుతున్న హిట్ 3 పై మంచి బజ్ క్రియేట్ అయింది. ఇటీవల విడుదలైన టీజర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో, ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
By: Tupaki Desk | 1 March 2025 11:30 AM GMTనాని హీరోగా తెరకెక్కుతున్న హిట్ 3 పై మంచి బజ్ క్రియేట్ అయింది. ఇటీవల విడుదలైన టీజర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో, ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు దర్శకుడు శైలేష్ కొలనూ తన మార్క్ టేకింగ్‌తో ఆసక్తికరమైన మూడ్ సెట్ చేశాడు. ముఖ్యంగా, ఈసారి నాని పాత్ర మరింత ఇన్టెన్స్‌గా ఉంటుందని విలన్స్ ను ఊచకోత కోయనున్నట్లు టీజర్ ద్వారా అర్థమవుతోంది. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉండేలా కనిపిస్తోంది. థియేట్రికల్ డీల్స్ విషయంలో ముందుగానే దిల్ రాజు ముందంజ వేశారని సమాచారం.
దిల్ రాజు గతంలో సరిపోదా శనివారం సినిమా తెలుగు రాష్ట్రాల హక్కుల్ని 30 కోట్లకు కొనుగోలు చేసినప్పటికీ, అనుకున్నంత లాభాలు మాత్రం రాలేదు. బాక్సాఫీస్ వద్ద సినిమా డీసెంట్ రన్ ఇచ్చినా, పెట్టుబడి తిరిగి వచ్చాక కేవలం 2-3 కోట్ల మేరే లాభం తెచ్చిపెట్టింది. ఇక ఇప్పుడు హిట్ 3 టీజర్‌ను బట్టి చూస్తే, ఈ సినిమా అంచనాలు మరింత పెరిగాయి. దిల్ రాజు ముందుగానే నాని, వాల్ పోస్టర్ సినిమాతో చర్చించి రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
హిట్ 3లో నాని పాత్ర ఒక పవర్‌ఫుల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మొదటి రెండు పార్ట్‌ల కంటే ఎక్కువ యాక్షన్, థ్రిల్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉండనున్నాయట. ఈ సారి ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 30 కోట్ల కంటే ఎక్కువ బిజినెస్ అవ్వొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, ఈ బిజినెస్ దిల్ రాజుకు ఎంత వరకు లాభాలు తెస్తుందో చూడాలి.
ఇటీవల దిల్ రాజు బ్యానర్ పెద్దగా విజయాలు నమోదు చేయలేకపోయింది. సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా మాత్రమే మంచి ప్రాఫిట్స్ ఇచ్చింది. ఇక గేమ్ ఛేంజర్ భారీ బడ్జెట్ సినిమాగా వచ్చి వందల కోట్లు పోగొట్టింది. అందుకే, చిన్న మధ్య తరహా సినిమాలతో దిల్ రాజు మళ్లీ ట్రాక్‌లోకి రావాలని చూస్తున్నాడు. హిట్ 3 లాంటి ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ప్రస్తుతం ఆడియెన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యే జానర్.
ఈ సినిమాకు ముందు రెండు పార్ట్‌లు మంచి పేరు తెచ్చిన నేపథ్యంలో, ఈసారి మరింత మంచి బిజినెస్ అవుతుందనే నమ్మకంతో దిల్ రాజు ముందుగానే థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సినిమా కంటెంట్ హిట్టయితే, ఈసారి మంచి లాభాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక హిట్ 3 సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.