Begin typing your search above and press return to search.

HIT 3 అర్జున్ సర్కార్.. అతనే ఒక ప్రమాదం!

'HIT: The 3rd Case' అనే టైటిల్‌తో హాంటర్స్ కమాండ్ అంటూ ఒక చేసింగ్ యాక్షన్ సీన్ ను రిలీజ్ చేశారు.

By:  Tupaki Desk   |   5 Sep 2024 7:31 AM GMT
HIT 3 అర్జున్ సర్కార్.. అతనే ఒక ప్రమాదం!
X

నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో మినిమమ్ 100 కోట్ల మార్కెట్ తో దూసుకుపోతున్నాడు. అలాగే ఇటీవలే విడుదలైన 'సరిపోదా శనివారం'తో హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్స్‌ అందుకున్నాడు. ఇప్పుడు నాని తన 32వ సినిమా కోసం సిద్ధమయ్యాడు. మొన్నటివరకు వరుస అప్డేట్స్ తో ఊరిస్తున్న మేకర్స్ ఇప్పుడు అధికారికంగా ఈ సినిమా ప్రకటన చేసారు. 'HIT: The 3rd Case' అనే టైటిల్‌తో హాంటర్స్ కమాండ్ అంటూ ఒక చేసింగ్ యాక్షన్ సీన్ ను రిలీజ్ చేశారు.

డాక్టర్ శైలేష్ కొలనూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్‌లో ప్రశాంతి తిపిర్నేని, యూనానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. వీడియోలో నాని పాత్రకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. మంచు పర్వతాల మధ్య ఒక హిట్ ఆఫీసర్ కారును నడుపుతూ ఉండగా, ఒకే సమయంలో మరికొంతమంది పోలీస్ ఆఫీసర్లు అతడిని వెంబడిస్తు ప్రయత్నిస్తున్న దృశ్యాలతో ప్రారంభమవుతుంది.

వీరందరిలో ఉత్కంఠ రేపుతూ ఒక పోలీస్ ఆఫీసర్ తన సహచరుడికి "అతడు ప్రమాదంలో ఉన్నాడు" అని హెచ్చరిస్తాడు. అయితే మరో ఆఫీసర్ మాత్రం "అతడే ప్రమాదం" అని చెబుతాడు. అతడి పేరు అర్జున్ సర్కార్ అని వెల్లడించడంతో మరింత ఉత్కంఠ రేపుతుంది. నాని అర్జున్ సర్కార్ అనే పాత్రలో చాలా స్టైలిష్‌గా, కఠినంగా కనిపిస్తారని అనిపిస్తుంది.

రక్తంతో చేతిలో గొడ్డలి, సిగరెట్, కారును డ్రైవ్ చేస్తున్న నాని లుక్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచేలా ఉంది. అర్జున్ సర్కార్ అనే పాత్ర ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో అనే విషయం ఈ ఒక్క సీన్ తో అర్ధమవుతుంది. శైలేష్ కొలనూ ఇప్పటికే హిట్ సిరీస్‌లో విజయవంతమైన రెండు చిత్రాలను తెరకెక్కించారు. ఇప్పుడు హిట్ 3 మరింత ఆకర్షణీయంగా, భారీ స్థాయిలో ఉండబోతుందనే అంచనాలు ఉన్నాయి. టీజర్ చూస్తేనే ఈ సినిమా గ్రాండ్‌గా, స్టైలిష్‌గా ఉండబోతుందని అర్ధమవుతోంది.

మిక్కీ జే మేయర్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మరింత ఉత్కంఠను తీసుకువచ్చింది. సానూ జాన్ వర్గీస్ అద్భుతమైన సినిమాటోగ్రఫీతో కళ్లకు కట్టినట్లు అందమైన విజువల్స్ అందించారు. కర్తికా శ్రీనివాస్ ఈ చిత్రానికి ఎడిటర్‌గా, శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. 'హంటర్ కమాండ్' వీడియో ద్వారా అర్జున్ సర్కార్ పాత్ర ఎంత ఉత్కంఠభరితంగా ఉండబోతుందో ఒక అవగాహన కలిగింది. ఇక ఈ సినిమా 2025 మే 1 థియేటర్లలో విడుదల కానుందని నిర్మాతలు ప్రకటించారు. ఇప్పటికే సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇక పాన్ ఇండియా రేంజ్ లో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.