ఓటిటి రిలీజ్ లో కూడా పోటీ ఏంటో..?
ప్రతి శుక్రవారం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. వాటిలో కొన్ని సినిమాలు సక్సెస్ అవుతాయి కొన్ని ఆశించిన ఫలితాలు అందుకోలేవు.
By: Tupaki Desk | 19 March 2025 3:08 AMప్రతి శుక్రవారం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. వాటిలో కొన్ని సినిమాలు సక్సెస్ అవుతాయి కొన్ని ఆశించిన ఫలితాలు అందుకోలేవు. ఐతే కొన్ని సినిమాలు థియేట్రికల్ వర్షన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా ఓటీటీలో మెప్పిస్తాయి. ఐతే థియేట్రికల్ వెర్షన్ లో ఒక సినిమాతో మరో సినిమా పోటీ పడగా ఓటీటీలో కూడా ఆ పోటీ కొనసాగిస్తున్నాయి. ఈమధ్య వచ్చిన రెండు సినిమాలు థియేట్రికల్ రిలీజ్ ఒకేరోజు రిలీజ్ కాగా ఓటీటీ లో కూడా ఒకేరోజు స్ట్రీమింగ్ అవుతూ షాక్ ఇస్తున్నాయి.
కోలీవుడ్ లో ఈమద్య రిలీజైన డ్రాగన్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అశ్వత్ మారిముత్తు డైరెక్ట్ చేసిన ఈ సినిమా యూత్ ఆడియన్స్ కి బాగా ఎక్కేసింది. ప్రదీప్ రంగనాథ్, కయదు లోహార్, అనుపమ నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 21న రిలీజై 100 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. ఐతే అదే రోజు జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమా రిలీజైంది. ఆ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ధనుష్ డైరెక్ట్ చేశారు.
డ్రాగన్, జాబిలమ్మ నీకు అంత కోపమా రెండు సినిమాలు యూత్ ఆడియన్స్ టార్గెట్ తోనే రిలీజ్ అయ్యాయి. ఐతే ఆ రెండిటిలో డ్రాగన్ మాత్రమే సూపర్ హిట్ అయ్యింది. ఐతే ఈ సినిమాలు రెండు థియేట్రికల్ వెర్షన్ ఒకేరోజు రిలీజ్ కాగా ఓటీటీ రిలీజ్ కూడా మార్చి 21 నుంచి డిజిటల్ రిలీజ్ అవుతుంది. డ్రాగన్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో వస్తుంటే.. జాబిలమ్మ నీకు అంత కోపమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతుంది.
ఇక ఈ సినిమాలతో పాటుగా ఫిబ్రవరి 20న రిలీజ్ అయిన మలయాళ సినిమా ఆఫీసర్ ఆన్ డ్యూటీ.. ఈ సినిమా కూడా మంచి థ్రిల్లర్ గా ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ మూవీ కూడా మార్చి 20 నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులోకి వస్తుంది. 3 సినిమాలు రిలీజైన డేట్ కి సరిగ్గా అదే డేట్ అంటే నెల టైం కు ఓటీటీ రిలీజ్ అవుతున్నాయి.
మలయాళ సినిమా ఆఫీసర్స్ ఆన్ డ్యూటీ సినిమా తెలుగు వెర్షన్ ను మార్చి 14న థియేట్రికల్ రిలీజ్ చేశారు. ఐతే ఆ సినిమా రిలీజైన వారంలోనే ఓటీటీ రిలీజ్ అవ్వడం విశేషం. మరి ఈ సినిమాలు థియేట్రికల్ రన్ లో ప్రేక్షకుల మనసులు గెలుచుకోగా ఓటీటీ రిలీజ్ లో ఎలాంటి రిజల్ట్ తెచ్చుకుంటాయన్నది చూడాలి.
ఈమధ్య ఎక్కువ ఆడియన్స్ థియేటర్ లో సినిమా చూడటం కన్నా ఓటీటీలో రిలీజ్ అయ్యాకే చూస్తున్నారు. అందుకే చాలా సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాక ఎక్కువ బజ్ ఏర్పరచుకుంటున్నాయి. అంతేకాదు థియేటర్ ఓ రిలీజైన సినిమా ఫ్లాప్ అందుకున్నా ఓటీటీలో సూపర్ అనిపించుకున్న సినిమాలు ఉన్నాయి.