Begin typing your search above and press return to search.

హిట్ 3 టీజర్: విలన్లకే భయం పుట్టించే అర్జున్ సర్కార్

అర్జున్ సర్కార్ అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా, నాని తన అగ్రెసివ్ యాటిట్యూడ్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

By:  Tupaki Desk   |   24 Feb 2025 6:20 AM GMT
హిట్ 3 టీజర్: విలన్లకే భయం పుట్టించే అర్జున్ సర్కార్
X

నేచురల్ స్టార్ నాని ప్రతీ సినిమాతో కూడా డిఫరెంట్ కంటెంట్ తో సర్ ప్రైజ్ చేస్తున్నాడు. ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక కొత్త పాయింట్ ఉండాల్సిందే. అయితే ఈసారి హిట్ 3లో నాని ఎంచుకున్న పాత్ర ఊహాలకందని ఊచకోత తరహాలో ఉన్నట్లు అనిపిస్తోంది. అర్జున్ సర్కార్ అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా, నాని తన అగ్రెసివ్ యాటిట్యూడ్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అతని లుక్, బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్ మొత్తం కొత్తగా ఉన్నాయి.

నేడు నాని పుట్టినరోజు సందర్భంగా రిలీజైన టీజర్‌లో నాని ఊచకోత అంటే ఏంటో చూపించాడు. కాశ్మీర్ బ్యాక్ డ్రాప్స్, టెర్రర్ అలాగే మర్డర్ మిస్టరీ లాంటి అంశాలు గట్టిగానే ఉన్నట్లు అర్ధమవుతుంది. దర్శకుడు శైలేష్ కొలను ఈసారి హిట్ సీరీస్ ను యాక్షన్ బ్యాక్ డ్రాప్ గట్టిగానే ప్లాన్ చేసినట్లు అర్ధమవుతుంది. ఇక అతని లాటికి దొరికితే విలన్స్ కు కష్టమే అన్నట్లు క్యారెక్టర్ ను హైలెట్ చేశారు.

మొదటి సారి చూసిన వెంటనే, నాని స్క్రీన్ ప్రెజెన్స్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉందో స్పష్టంగా తెలుస్తోంది. తెల్లటి సూట్, బ్లాక్ బో టై, చేతిలో రక్తం అంటిన కత్తి ఈ లుక్ చూసినవాళ్లలో వణుకు పుట్టించేలా ఉంది. నాని ఈ సినిమాలో విలన్లను తరిమికొట్టడమే కాదు, వాళ్లు అనుకున్నది కన్నా పదింతలు భయంకరంగా బదులిచ్చే పోలీస్‌గా మారాడు. టీజర్‌లో నాని వేసే ప్రతి స్టెప్, చూపించే ప్రతి ఎక్స్‌ప్రెషన్ ఒక రేంజ్‌లో ఉంది.

ప్రత్యేకంగా ఫైట్ సీక్వెన్స్ అయితే ఈ సినిమాలో హైలైట్‌గా నిలిచేలా ఉంది. నాని ఈ రేంజ్‌లో యాక్షన్ చేయడం, విలన్లను చూస్తూ సరిగ్గా స్మైల్ ఇస్తూ దాడి చేయడం, టీజర్ మొత్తాన్ని హై ఓల్టేజ్ స్థాయిలో ఉంచింది. హిట్ 3 కేవలం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మాత్రమే కాదు, ఒక బ్రూటల్ యాక్షన్ మూవీ అని చెప్పకనే చెప్పింది. హిట్ ఫ్రాంచైజ్‌లో ఇదే మోస్ట్ వయలెంట్ చాప్టర్ అని టీజర్ ద్వారా స్పష్టమవుతోంది. దర్శకుడు శైలేష్ కొలను ఈసారి కథను మరింత హార్డ్ హిట్టింగ్‌గా తీసుకువచ్చినట్లు అర్థమవుతోంది.

హిట్ 1, 2లతో పోలిస్తే, ఈ సినిమాలో యాక్షన్ కూడా డబుల్ అయింది. ఒక కేసును చేదించడంలో అర్జున్ సర్కార్ ఎంతవరకు వెళ్తాడో, ఎంత కఠినంగా వ్యవహరిస్తాడో టీజర్ చూపిస్తోంది. ఈ సినిమాను ప్రశాంతి త్రిపిర్నేని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ప్రతి షాట్‌లోనూ గ్రాండ్‌నెస్ కనిపిస్తుంది. టీజర్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ అన్ని హై క్వాలిటీ టెక్నికల్ వర్క్‌ను ప్రతిబింబిస్తున్నాయి. నాని హిట్ 3లో అందించే థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ వేరే స్థాయిలో ఉంటుందని చెప్పవచ్చు. ఇక హిట్ 3 మే 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఇక టీజర్ కంటే సినిమా ఇంకెంత వయలెంట్‌గా, థ్రిల్లింగ్‌గా ఉండబోతుందో చూడాలి.