Begin typing your search above and press return to search.

హిట్ మల్టీవర్స్.. ఎందుకు లేట్ అవుతుంది..?

న్యాచురల్ స్టార్ నాని హీరోగానే కాదు నిర్మాతగా కూడా సినిమాపై తనకున్న అభిమానం చూపిస్తున్నాడు.

By:  Tupaki Desk   |   4 Sep 2023 6:10 AM GMT
హిట్ మల్టీవర్స్.. ఎందుకు లేట్ అవుతుంది..?
X

న్యాచురల్ స్టార్ నాని హీరోగానే కాదు నిర్మాతగా కూడా సినిమాపై తనకున్న అభిమానం చూపిస్తున్నాడు. సినిమాలో హీరో అయితే తన వరకే లాభ పడతాడు కానీ నిర్మాతగా మారితే మాత్రం తన ద్వారా మరికొంతమందికి అవకాశం వస్తుందని అలా ఫిక్స్ అయ్యాడు నాని. ఎక్కడ సంపాదిస్తున్నామో అక్కడే ఖర్చు పెట్టాలని కొంతమంది అనుకుంటారు. వారి దారిలోనే నాని కూడా హీరోగా చేస్తూనే ఫుల్ టైం ప్రొడ్యూసర్ గా మెప్పిస్తున్నాడు. నాని నిర్మాతగా చేసిన మొదటి సినిమా అ! మంచి చిత్రంగా సక్సెస్ అయ్యింది.

అ! ఇచ్చిన ప్రోత్సాహంతో హిట్ ది ఫస్ట్ కేస్ సినిమా చేశాడు నాని. నాని వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ లో నాని, ప్రశాంతి కలిసి నిర్మించిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. విశ్వక్ సేన్, రుహాని జంటగా నటించిన ఈ సినిమా సీక్వెల్ గా హిట్ 2 కూడా చేశారు. హిట్ 2 లో అడివి శేష్ హీరోగా నటించాడు. ఆ సినిమా కూడా హిట్ అందుకుంది. శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలను హిట్ ఫ్రాంచైజ్ లుగా కొనసాగించాలని చూస్తున్నారు.

హిట్ 1 విశ్వక్ సేన్ చేయగా.. హిట్ 2 అడివి శేష్ చేశాడు. హిట్ 2 లోనే హిట్ 3 హీరోని ఇంట్రడ్యూస్ చేశాడు శైలేష్. హిట్ 3లో నిర్మాత నానినే మెయిన్ లీడ్ గా నటిస్తాడని తెలుస్తుంది. ఆల్రెడీ కథ రెడీ చేసుకున్న శైలేష్ సినిమా మొదలు పెట్టాల్సి ఉంది. అయితే ఆల్రెడీ వెంకటేష్ తో సైంధవ్ సినిమా చేస్తున్న శైలేష్ ఆ సినిమా తర్వాత హిట్ 3 సెట్స్ మీదకు తీసుకెళ్లే అవకాశం ఉంది. హిట్ 3 నాని వల్ల లేట్ అవుతుందా లేక శైలేష్ రెడీగా లేడా అన్నది తెలియదు కానీ శైంధవ్ సినిమా పూర్తయ్యాక కూడా హిట్ 3 వెంటనే సెట్స్ మీదకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు.

హిట్ సీరీస్ లతో సైంధవ్ డైరెక్టర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఓ పక్క హిట్ మల్టీవర్స్ చేస్తూనే మరోపక్క వేరే సినిమాలు కూడా చేస్తున్నాడు. హిట్ ఫ్రాంచైజ్ లుగా దాదాపు 7 సినిమాల ప్లానింగ్ లో ఉన్నాడట శైలేష్ కొలను. హిట్ 3 లో నాని చేస్తుండగా రాబోయే సీరీస్ లలో స్టార్స్ ని తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. హిట్ చివరి సీరీస్ లో మాత్రం ఈ స్టార్స్ అంతా కూడా కలిసి నటిస్తారని ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెబుతున్నారు.