Begin typing your search above and press return to search.

మెగాస్టార్ తో హిట్ డైరెక్టర్.. జస్ట్ మిస్

తాజాగా ఓ ఇంటర్వ్యూలో శైలేష్ కొలను ఆ ఆఫర్ గురించి క్లారిటీ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవితో సినిమాకి సంబందించిన చర్చించిన మాట వాస్తవమేనని చెప్పారు.

By:  Tupaki Desk   |   26 Dec 2023 4:14 AM GMT
మెగాస్టార్ తో హిట్ డైరెక్టర్.. జస్ట్ మిస్
X

హిట్ సిరీస్ తో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను. ఇప్పుడు ఈ యంగ్ డైరెక్టర్ విక్టరీ వెంకటేష్ తో సైంధవ్ మూవీ చెస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. పాన్ ఇండియా రేంజ్ లో యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతోనే ఈ మూవీ సిద్ధమైంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కంటే ముందుగానే శైలేష్ కొలనుకి మెగాస్టార్ చిరంజీవితో వర్క్ చేసే అవకాశం వచ్చిందంట.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో శైలేష్ కొలను ఆ ఆఫర్ గురించి క్లారిటీ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవితో సినిమాకి సంబందించిన చర్చించిన మాట వాస్తవమేనని చెప్పారు. నిజానికి నా కథ మీదనే నేను వర్క్ చేస్తాను. అలా చేస్తేనే నాకు ఒక స్పష్టత ఉంటుంది. వేరొకరి కథకి నేను పూర్తిగా న్యాయం చేయలేను. చిరంజీవితో సిట్టింగ్ సందర్భంగా వేరొక స్టొరీ గురించి చర్చించడం జరిగింది.

దాంతో నా అభిప్రాయాన్ని ఆయనకీ తెలియజేశాను. చిరంజీవి గారు కూడా మనస్పూర్తిగా ఒప్పుకున్నారు. అప్పుడు అనుకున్న కథ కూడా పట్టాలు ఎక్కలేదు. అందుకే దాని గురించి నేను ఎక్కువ ఆలోచించలేదు. చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగాను. అతన్ని ఎలా చూపించాలనేది నాకంటూ ఒక విజన్ ఉంది.

దాని ప్రకారమే ఒక మంచి కథని సిద్ధం చేసుకొని ఎలా అయిన మెగాస్టార్ గారిని ఒప్పించి సినిమా చేస్తాననే నమ్మకం నాకు ఉంది. ఆ రోజు కోసం ఎదురుచూస్తాను. అయితే వేరే కథకి నేను న్యాయం చేయలేను. చిరంజీవి గారు పిలిచి ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడటం జరిగిందని శైలేష్ కొలను క్లారిటీ ఇచ్చారు.

మొత్తానికి శైలేష్ పెట్టుకున్న రూల్ కారణంగా మెగాస్టార్ తో సినిమా చేసే అవకాశం వదులుకున్నాడని అతని మాటల బట్టి స్పష్టం అవుతుంది. అయితే అది రీమేక్ మూవీనా లేదంటే వేరొక రైటర్ తీసుకొచ్చిన కథ అనేది క్లారిటీ లేదు. ఒక వేళ సైంధవ్ హిట్ పడితే మాత్రం కచ్చితంగా చిరంజీవితో మూవీ చేసే అవకాశం శైలేష్ చాలా వేగంగా సొంతం చేసుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.