Begin typing your search above and press return to search.

'హిట్ -3'కి అన్నీ ఆయనైతే..ఈయ‌నెందుకంట‌?

ఈ నేప‌థ్యంలో హిట్ 3 స్టోరీ, స్క్రీన్ ప్లే నాని సిద్దం చేస్తున్నాడ‌ని, ఇందులో శైలేష్ ఇన్వాల్వ్ మెంట్ లేద‌ని, అత‌డు కేవ‌లం మేకింగ్ వ‌ర‌కే పరిమిత‌నే ప్ర‌చారం సాగుతోంది.

By:  Tupaki Desk   |   27 July 2024 7:16 AM GMT
హిట్ -3కి అన్నీ ఆయనైతే..ఈయ‌నెందుకంట‌?
X

'హిట్ 'ప్రాంచైజీతో ఫేమ‌స్ అయిన యువ ద‌ర్శ‌కుడు శేలేష్ కొల‌ను గురించి ప‌రిచయం అవ‌స‌రం లేదు. క్రైమ్ ఇన్విస్టిగేష‌న్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కించిన హిట్ రెండు భాగాలు భారీ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ రెండు సినిమాల‌కు క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ అన్నీ శేలేష్ నే. అత‌డే స్వ‌యంగా క‌థ‌ని సిద్దం చేసుకుని ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అత‌డి లో ఆ ట్యాలెంట్ చూసే విక్ట‌రీ వెంక‌టేష్ సైంధ‌వ్ సినిమాకి ఛాన్స్ ఇచ్చాడు. ఇది క్రైమ్ స్టోరీనే.

కానీ రొటీన్ స్టోరీ గా ఉండ‌టంతో ప్రేక్ష‌కుల‌కు రుచించ‌లేదు. అలాగే హిట్ -3ని నేచుర‌ల్ స్టార్ నానితో తెర‌కెక్కి స్తున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. 'హిట్ -2' క్లైమాక్స్ లోనే ఆ సంగ‌తి చెప్పేసాడు శేలేష్. అలాగే హిట్ మొద‌టి భాగాన్ని నిర్మించింది నాని కి చెందిన వాల్ పోస్ట‌ర్ నిర్మాణ సంస్థ అన్న‌ది తెలిసిందే. ఈ నేప‌థ్యంలో హిట్ 3 స్టోరీ, స్క్రీన్ ప్లే నాని సిద్దం చేస్తున్నాడ‌ని, ఇందులో శైలేష్ ఇన్వాల్వ్ మెంట్ లేద‌ని, అత‌డు కేవ‌లం మేకింగ్ వ‌ర‌కే పరిమిత‌నే ప్ర‌చారం సాగుతోంది.

అయితే ఇదంతా త‌ప్పుడు ప్రచార‌మే. హిట్ ప్రాంచైజీ పుట్టిందే శైలేష్ కొల‌ను నుంచి. అలాంట‌ప్పుడు ఆ బాధ్య‌తలు నాని ఎందుకు తీసుకుంటాడు? క‌థ‌లు రాసే క్రియేటివిటీ నానిలో ఉన్నా మ‌రొక‌రి క‌థ‌ని లాక్కునేంత సాహ‌సం మాత్రం చేయ‌డు. నాని ద‌ర్శ‌కుల హీరో. ద‌ర్శ‌కుల‌తో క్రియేటివ్ ప‌రంగా ఏమాత్రం డిఫ‌రెన్సెస్ రాకుండా చూసు కుంటాడు. క‌థ‌లో ఆయ‌న ఇన్ పుట్స్ ఉన్నా? అది కొంత‌వ‌ర‌కే. అంతిమంగా ద‌ర్శ‌కుడు చెప్పిందే నాని చేస్తాడు.

ఈ నేప‌థ్యంలో నాని 'హిట్ -3' కోసం ఛాన్స్ తీసుకోడ‌ని ఆయ‌న అభిమానులు విశ్వ‌షిస్తున్నారు. ప్ర‌స్తుతం శైలేష్ కొల‌ను 'హిట్3' ప్రాజెక్ట్ ప‌నుల్లోనే ఉన్న‌ట్లు తెలుస్తోంది. సైంధ‌వ్ ఆశించిన ఫ‌లితాలు సాధించ‌ని నేప‌థ్య‌లో హిట్ పైనే దృష్టి పెట్టాడు. ఇక నాని 'స‌రిపోదా శ‌నివారం'తో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతున్నాడు. ఇది రిలీజ్ అయిన అనంత‌రం శ్రీకాంత్ ఓదెల‌ సినిమాతో పాటు, హిట్ -3ని ప‌ట్టాలెక్కించే అవ‌కాశాలున్నాయ‌ని స‌మాచారం.