Begin typing your search above and press return to search.

'పుష్ప 2' పీలింగ్స్‌.. వ‌ర్శిటీ మ‌హిళా ప్రొఫెష‌ర్ స్టెప్పులు

ఈ సినిమా ఇంత పెద్ద విజ‌యం సాధించ‌డం వెన‌క యాక్ష‌న్ కంటే ఎమోష‌న్ ప్ర‌భావ‌మే ఎక్కువ‌.

By:  Tupaki Desk   |   24 Dec 2024 6:13 AM GMT
పుష్ప 2 పీలింగ్స్‌.. వ‌ర్శిటీ మ‌హిళా ప్రొఫెష‌ర్ స్టెప్పులు
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన 'పుష్ప 2' ప్ర‌పంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద అద్భుత‌మైన వ‌సూళ్ల‌ను సాధిస్తున్న సంగ‌తి తెలిసిందే. విడుద‌లైన మూడోవారంలో 1600 కోట్ల వసూళ్ల‌తో దిగ్విజయంగా థియేట‌ర్ల‌లో ర‌న్ అవుతోంది. ఈ సినిమా ఇంత పెద్ద విజ‌యం సాధించ‌డం వెన‌క యాక్ష‌న్ కంటే ఎమోష‌న్ ప్ర‌భావ‌మే ఎక్కువ‌. ముఖ్యంగా అల్లు అర్జున్- ర‌ష్మిక మంద‌న్న మ‌ధ్య రొమాన్స్ ఈ సినిమాలో ప్ర‌ధాన హైలైట్ గా నిలిచింద‌న్న ప్ర‌శంస‌లు కురిసాయి.

ఈ సినిమాలోని కొన్ని పాట‌లు కూడా మాస్ ఆడియెన్ కి బాగా క‌నెక్ట‌య్యాయి. పుష్ప 2 లో కిచెన్ లో అల్లు అర్జున్- ర‌ష్మిక జంట రొమాన్స్ కి మంచి గుర్తింపు ద‌క్కింది. రొమాన్స్ నేప‌థ్యంలో ఈ జంట పీలింగ్స్ పాట‌లో అద్భుత‌మైన స్టెప్పుల‌తో అల‌రించారు. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా కెమిస్ట్రీ ఒక రేంజులో వ‌ర్క‌వుటైంది కూడా. ఈ పాట‌కు ఇప్పుడు ప్ర‌ముఖ యూనివ‌ర్శిటీ మ‌హిళా ప్రొఫెస‌ర్ స్టెప్పులు వేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

కొచ్చిన్ యూనివర్శిటీ నుంచి మ‌హిళా ప్రొఫెసర్, డిపార్ట్ మెంట్ హెడ్ ఒక‌రు పుష్ప 2 'పీలింగ్స్‌' పాట‌కు విద్యార్థులతో క‌లిసి స్టెప్పులు వేసిన వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ప్రొఫెస‌ర్ ఎనర్జీ సాటిలేనిది అంటూ కితాబు అందుకుంది. ఈ వీడియోని ఏకంగా ఒరిజిన‌ల్ పాట‌కు ధీటుగా పోటీప‌డుతూ ల‌క్ష‌లాది మంది వీక్షించారు. విద్యార్థుల‌తో పోటీప‌డుతూ మ‌హిళా ప్రొఫెస‌ర్ ఎంతో ఎన‌ర్జిటిక్ గా డ్యాన్సులు చేసారు. కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CUSAT)కి చెందిన ఈ ప్రొఫెస‌ర్ మైక్రోబయాలజీ స‌బ్జెక్ట్ ని భోధిస్తార‌ని స‌మాచారం. ప్రొఫెసర్ అంటే సీరియ‌స్ మోడ్ అని భావించేవారికి భిన్న‌మైన వ్య‌క్తిత్వం ఆమెలో క‌నిపించింది. మూసను చాలా సంతోషకరమైన రీతిలో ఛేదించారు అంటూ మ‌హిళా ప్రొఫెస‌ర్ ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు.

CUSATలోని డిపార్ట్‌మెంట్ హెడ్ (HOD) పార్వతి వేణు, తన విద్యార్థులను డ్యాన్స్ ఫ్లోర్‌లో అద‌ర‌గొట్టిన వీడియో సోష‌ల్ మీడియాల్లో వేగంగా వైర‌ల్ అయింది. విద్యార్థులు పీలింగ్స్ పాట‌కు డ్యాన్సులు చేస్తున్న స‌మ‌యంలో అక్క‌డే ఉన్న మ‌హిళా ప్రొఫెస‌ర్ త‌న చేతిలోని ప‌ర్సును సమీపంలోని ఓ కుర్చీలో ఉంచి , వారితో పాటు స్టెప్పు క‌ల‌ప‌డం ఎంతో ఆక‌ట్టుకుంది. విద్యార్థుల ఉత్సాహానికి అద్దం పట్టే విధంగా సులభంగా నృత్యం చేస్తూ ప్రొఫెస‌ర్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. ఈ వీడియోకు సుమారు 70ల‌క్ష‌ల వీక్ష‌ణ‌లు వ‌చ్చాయి.

వీడియోతో పాటు క్యాప్షన్ ఆకట్టుకుంది.. ''మీ HOD మేడమ్ మీ కంటే ఎక్కువ వైబర్‌గా ఉన్నప్పుడు'' అనే క్యాప్ష‌న్ అంద‌రినీ ఆక‌ర్షించింది. ఈ వీడియో వీక్షించాక‌ ప్రొఫెస‌ర్‌పై నెటిజ‌నుల నుంచి ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ప్రొఫెసర్లు విద్యార్థులతో చేరినప్పుడు, వారు జీవితకాలం జ్ఞాపకాలను సృష్టిస్తారు అని ఒక‌రు ప్ర‌శంసించ‌గా, ప్రొఫెసర్లందరూ ఇంత సజీవంగా నిజాయితీగా స‌ర‌ళంగా ఉండాలని కోరుకుంటున్నాను అని ఒకరు ప్ర‌శంసించారు..విద్యార్థుల్లో కలుపుగోలుతనం కనిపిస్తుంది- ర్యాంకులు అంకెల కోసం కాదు అని మరొక నెటిజ‌న్ ప్ర‌శంసించారు. విద్యార్థులతో ఎలా కనెక్ట్ అవ్వాలో తెలిసిన ఈ అద్భుతమైన మేడం పట్ల గౌరవం పెరుగుతోందని ఒక‌రు వ్యాఖ్యానించారు.