హాలీవుడ్ స్టార్ హీరోయిన్‌తో రాయన్ ఏంటో కథ..!
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం హాలీవుడ్ ముద్దుగుమ్మ, లేటెస్ట్ సెన్షేషన్ అయిన సిడ్నీ స్వీనితో ధనుష్ టీం చర్చలు జరుపుతున్నారు.
By: Tupaki Desk | 10 Dec 2024 5:10 AM GMTధనుష్ తన స్వీయ దర్శకత్వంలో రూపొందించి, హీరోగా నటించిన 'రాయన్' సినిమా తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీ ద్వారా అన్ని వర్గాల వారిని మెప్పిస్తోంది. అన్ని భాషల్లోనూ రాయన్‌కి మంచి స్పందన లభించింది. రాయన్ తర్వాత తన స్వీయ దర్శకత్వంలో మరో సినిమాను చేస్తూ ఉన్నాడు. ఆ సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలోనే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ 'కుబేరా' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ధనుష్ ఒకేసారి మూడు నాలుగు సినిమాలు చేసే సత్తా ఉన్న నటుడు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
కుబేరా సినిమా విడుదలకు రెడీ అవుతున్న ఈ సమయంలో ధనుష్ కొత్త సినిమా కోసం చర్చలు జరుపుతూ ఉన్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం హాలీవుడ్ ముద్దుగుమ్మ, లేటెస్ట్ సెన్షేషన్ అయిన సిడ్నీ స్వీనితో ధనుష్ టీం చర్చలు జరుపుతున్నారు. ఆమెను ధనుష్ తో త్వరలోనే చూడబోతున్నాం అంటూ తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. సిడ్నీ ప్రస్తుతం హాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ నటి. ఆమెతో ఎన్నో సినిమాలను చేసేందుకు ప్రముఖ ఫిల్మ్ మేకర్స్ దేశ విదేశాల నుంచి సంప్రదిస్తూ ఉంటారట. అలాంటి స్టార్ తో ధనుష్ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి.
గతంలో ధనుష్ హాలీవుడ్ సినిమాలు చేశాడు. కనుక మరోసారి ఆయన హాలీవుడ్ సినిమాను చేయబోతున్నాడా లేదంటే ఆయన ఒక సౌత్ ఇండియన్ సినిమా కోసం లేదా హిందీ సినిమా కోసం ఆమెను సంప్రదించాడా అనేది తెలియడం లేదు. హాలీవుడ్‌లో ఆమెకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఇంగ్లీష్ సినిమా చేస్తేనే బాగుంటుంది కనుక ఆమెను హాలీవుడ్ మూవీకే సంప్రదించి ఉంటారు అనేది కొందరి అభిప్రాయం. అసలు విషయం ఏంటి అనేది తెలియాలి అంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఆకట్టుకునే కథ, కథనంతో ధనుష్ సినిమాలు ఉంటాయి కనుక సిడ్నీ స్వీని ఈ ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పవచ్చు.
ధనుష్ గతంలో చేసిన హాలీవుడ్ సినిమాలు ఒక మోస్తరు వరకే ప్రేక్షకుల వద్దకు వెళ్లాయి. అందుకే ఈసారి కాస్త ఎక్కువ మందికి రీచ్ కావాలి అంటే సిడ్నీ వంటి స్టార్ తో రొమాన్స్ చేయడం వల్ల వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే ధనుష్ ఈ సారి హాలీవుడ్ స్టార్‌తో చర్చలు జరుపుతున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకుంటూ ఉన్న ధనుష్ ఎందుకు ఇలాంటి హాలీవుడ్ ప్రయత్నాలు చేస్తారు అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తారు. నటుడు అన్నప్పుడు అన్ని భాషల్లో నటించాలి, అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాలి అనేది ధనుష్ యొక్క అభిప్రాయంగా ఆయన ఫ్యాన్స్ చెబుతూ ఉంటారు.