Begin typing your search above and press return to search.

ఉపేంద్ర UI.. హాలీవుడ్ నుంచి ఎలివేషన్స్

అప్పట్లోనే చాలా అడ్వాన్స్ డ్ గా ఉండి అందరినీ మెప్పించాయి!

By:  Tupaki Desk   |   23 Dec 2024 6:54 AM GMT
ఉపేంద్ర UI.. హాలీవుడ్ నుంచి ఎలివేషన్స్
X

కన్నడ ప్రముఖ నటుడు ఉపేంద్ర.. సౌత్ ఇండియాలో ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. తెలుగులో కూడా ఆయనకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అయితే నటుడు గానే కాకుండా.. డైరెక్టర్ గా అదిరిపోయే సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అప్పట్లోనే చాలా అడ్వాన్స్ డ్ గా ఉండి అందరినీ మెప్పించాయి!

అయితే ఆయన కొన్నాళ్ల పాటు డైరెక్టర్ గా సినిమాలు తెరకెక్కించలేదు ఉపేంద్ర. చివరగా తొమ్మిది సంవత్సరాల క్రితం ఉప్పి2 మూవీని రూపొందించారు. ఇప్పుడు యూఐ మూవీతో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా.. డిసెంబర్ 20వ తేదీన పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అయింది.

అనౌన్స్మెంట్ తోనే వేరే లెవెల్ బజ్ ను క్రియేట్ చేసిన ఉపేంద్ర.. రకరకాల అప్డేట్స్ తో యూఐపై భారీ హైప్ క్రియేట్ చేశారు. వింటేజ్ ఉపేంద్రను మళ్లీ చూడనున్నట్లు విడుదలకు ముందే క్లారిటీ ఇచ్చారు. జోరుగా ప్రమోషన్స్ ను నిర్వహించారు. ఇప్పుడు తన మార్క్ వైవిధ్యమైన కాన్సెప్ట్ తో సినిమా తీసి హిట్ అందుకున్నారు ఉపేంద్ర.

సోషల్ మీడియాలో అనేక మంది సెలబ్రిటీలు యూఐ మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా హాలీవుడ్ స్వరకర్త, మూడుసార్లు గ్రామీ అవార్డు గ్రహీత, రికీ కేజ్.. సినిమాపై స్పందించారు. అమేజింగ్ మూవీ అని కొనియాడారు. అలౌకిక ప్రపంచంలో బ్లాక్ బస్టర్ హిట్ అని, యూనిక్ ఎంటర్టైనర్ అని తెలిపారు.

సినిమా అంతా ఆలోచనాత్మకంగా ఉందని, కచ్చితంగా థియేటర్లలో చూడాలని చెప్పారు. దీని బట్టి చూస్తే.. ఉపేంద్ర టాలెంట్ కు పాన్ వరల్డ్ లెవెల్ లో ఫ్యాన్స్ ఉన్నట్టు క్లియర్ గా తెలుస్తోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే క్రేజీ కాన్సెప్ట్ తో రూపొందిన ఆ మూవీ.. కన్నడతో పాటు తెలుగులో కూడా అదరగొడుతోంది.

ఫస్ట్ నుంచి సాలిడ్ గా ఉన్న యూఐ బుకింగ్స్ రోజురోజుకు పెరుగుతున్నాయి. డే1 కంటే డే2 బుకింగ్స్ ఎక్కువగా ఉండగా.. ఇప్పుడు రెండో రోజు కంటే మూడో రోజు ఎక్కువ బుకింగ్స్ నమోదయ్యాయి. ఇప్పుడు క్రిస్మస్ సెలవులు కూడా వస్తున్నాయి. దీంతో యూఐ మరిన్ని వసూళ్లు సాధించనుందన్నమాట. మొత్తానికి యూఐ చిత్రంతో ఉపేంద్ర స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.