ఆ నాలుగు సినిమాలపై హాలీవుడ్ సినిమా ఇంపెక్ట్!
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ చిత్రాల హవా గురించి చెప్పాల్సిన పనిలేదు
By: Tupaki Desk | 6 May 2024 7:45 AM GMTఇండియన్ బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ చిత్రాల హవా గురించి చెప్పాల్సిన పనిలేదు. హాలీవుడ్ నుంచి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద షేక్ చేసిన సినిమాలెన్నో. వందల కోట్ల వసూళ్లకి ఇండియన్ బాక్సాఫీస్ హాలీవుడ్ కి కీలకమైంది? అని ఎన్నో హాలీవుడ్ సినిమాలు నిరూపించాయి. మెట్రో సిటీస్ లో హాలీవుడ్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. తెలుగు సినిమాలకు ధీటుగా ఇంగ్లీష్ సినిమాల టికెట్లు తెగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఈ వారంలో ఓ హాలీవుడ్ సినిమాతో తెలుగు సినిమాలకు ప్రమాదం పొంచి ఉందనే సంకేతాలందుతున్నాయి.
ఈ వారంలో నారా రోహిత్ నటించిన `ప్రతినిధి-2` రిలీజ్ అవుతుంది. వాస్తవానికి ఇప్పటికే సినిమా రిలీజ్ కావాలి. కానీ అనివార్య కారణలతో వాయిదా పడినా సరిగ్గా ఎన్నికలకు రెండు రోజుల ముందు మే 10న రిలీజ్ అవుతుంది. ఇదే రోజున సత్యదేవ్ నటిస్తోన్న `కృష్ణమ్మ` కూడా ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ రెండు సినిమాలపై మోస్తారుగా బజ్ ఉంది. సరిగ్గా ఇదే రోజున హాలీవుడ్ సినిమా `రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్` కూడా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
మానవులు..చింపాజీల మధ్య కొన్ని రకాల సన్నివేశాలు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తున్నాయి. ట్రైలర్ లోనే ఇంత ఎమోషన్ పండిచారంటే? సినిమా ఇంకెలా ఉంటుందనే బజ్ భారీగా ఉంది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో హాలీవుడ్ సినిమా ఎఫెక్ట్ ఆరోజు రిలీజ్ అవుతున్న రెండు సినిమాలపై పడుతుందనే టాక్ వినిపిస్తుంది. చిన్న చిన్న పట్టణాల్లో సైతం హాలీవుడ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. టాక్ బాగుందంటే జనాలు థియేటర్ కి వెళ్లి చూస్తున్నారు.
దీంతో `కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్` ఎలాంటి పలితాలు సాధిస్తుంది అన్న ఆసక్తి నెలకొంది. ఇప్పటికే నరేష్ నటించిన `ఆ ఒక్కటి అడక్కు`.. సుహాస్ `ప్రసన్నవదనం` థియేటర్లో రన్నింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. వీటికి మరో సినిమా పోటీ లేకపోవడంతో బండి లాగిస్తున్నాయి. కానీ హాలీవుడ్ సినిమా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఆ ప్రభావం ఈ రెండు సినిమాలపై కూడా పడుతుందని ట్రేడ్ అంచనా వేస్తుంది. మరి హాలీవుడ్ నుంచి పోటీని ఆ నలుగు సినిమాలు ఎలా తట్టుకుంటాయి? అన్నది చూడాలి.