VD 14 : హాలీవుడ్ విలన్ ఫిక్స్ అయినట్లేనా?
రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు కాకుండా డిఫరెంట్ జోనర్లలో తెరకెక్కుతున్న మూవీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
By: Tupaki Desk | 8 Feb 2025 5:58 PM GMTహీరో విజయ్ దేవరకొండ కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో వరుస సినిమాల్లో నటిస్తున్నారు. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు కాకుండా డిఫరెంట్ జోనర్లలో తెరకెక్కుతున్న మూవీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న VD 12 మూవీ షూటింగ్ చివరి దశకు చేరకోగా.. త్వరలో మరో మూవీని పట్టాలెక్కించనున్నారు. అయితే విజయ్ చేతిలో రాహుల్ సాంకృత్యాన్ మూవీతోపాటు రవికిరణ్ కోలా ప్రాజెక్టులు ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఆ రెండు సినిమాలు సమ్ థింగ్ స్పెషల్ గా ఉండనున్నాయట!
అయితే ఇప్పటికే రాహుల్ సాంకృత్యాన్ తో విజయ్ టాక్సీవాలా మూవీ చేశారు. మళ్లీ ఇప్పుడు మరో మూవీ VD 14 చేసేందుకు సిద్ధమవుతున్నారు. పీరియాడికల్ మూవీగా భారీ బడ్జెట్ తో ఆ ప్రాజెక్టు తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. రెండు పార్టులుగా రిలీజ్ చేసే యోచనలో ఉన్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇతిహాసాలను ఎవరూ రాయరు.. అవి హీరోల రక్తంతో చెక్కబడతాయి అంటూ మేకర్స్ ఇప్పటికే షేర్ చేసిన మూవీ పోస్టర్ ప్రేక్షకులలో ఫుల్ గా క్యూరియాసిటీ పెంచింది. దీంతో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే మూవీలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్రలో కనిపించనున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి
ది మమ్మీ, ది మమ్మీ రిటర్న్స్ సినిమాల్లో విలన్ గా నటించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న ఆర్నాల్డ్ వోస్లూతో రాహుల్ చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆయనను ఒప్పించారని టాక్ వినిపిస్తోంది. కథలో బలమైన పాత్ర కనుకే ఆయనతో చేయించాలని గట్టిగా డైరెక్టర్ ఫిక్స్ అయ్యారని సమాచారం.
దీంతో VD 12లో ప్రతినాయకుడిగా ఆర్నాల్డ్ వోస్లూ కనిపించనుండడం ఫిక్స్ అయినట్లేనని తెలుస్తోంది. త్వరలోనే ఆయన పాత్రకు సంబంధించి మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారని సమాచారం.
సనిమాకు సంగీత ద్వయం అజయ్ అతుల్ బాణీలు కడుతున్నారు. అయితే విజయ్ కెరీర్ లో అత్యంత కీలకమైన సినిమాగా VD 12 ఉండనుందని తెలుస్తోంది. కంప్లీట్ గా మూవీ సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే విధంగా ఉంటుందని టాక్. దీంతో మూవీ కోసం ఈగర్లీ వెయిటింగ్ అని అంతా కామెంట్లు పెడుతున్నారు.