ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లు
మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ సినిమాలు సత్తా చాటాయి
By: Tupaki Desk | 29 July 2023 8:55 AM GMTమరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ సినిమాలు సత్తా చాటాయి. గతంలో పలు ఇంగ్లీష్ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వంద కోట్లు అంతకు మించి వసూళ్లు చేసిన దాఖలాలు చాలా ఉన్నాయి. అయితే కరోనా తర్వాత పరిస్థితులు మారాయి. హిందీ సినిమాలు వంద కోట్లు సాధించడం చాలా పెద్ద విషయం అయింది.
అలాంటిది హాలీవుడ్ సినిమాలు ఓపెన్ హైమర్, బార్బీ సినిమాలు మొదటి వారం రోజుల్లోనే భారీ వసూళ్లు సొంతం చేసుకున్నాయి. ఈ రెండు సినిమాలు కలిపి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల వసూళ్లు నమోదు చేశాయి. ఈ రెండు సినిమాలకు కూడా ఇండియన్ సినీ ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఈ వసూళ్లు సాధ్యం అయింది.
ఓపెన్ హైమర్ మొదటి వారం రోజుల్లో రూ.73.15 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. ఇక బార్బీ సినిమాకు ఇండియన్ ప్రేక్షకుల నుంచి రూ.27.5 కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. బాలీవుడ్ లో పెద్ద సినిమాల సందడి లేకపోవడంతో పాటు ఇతర భాషల్లో కూడా మంచి వసూళ్లు నమోదు చేస్తున్న నేపథ్యంలో లాంగ్ రన్ లో ఈ సినిమా లు రెండు కూడా కచ్చితంగా మంచి సంఖ్యలను నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.
ఓపెన్ హైమర్ సినిమా లో భౌతిక శాస్త్రవేత్త జే రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవిత చరిత్రను చూపించడం జరిగింది. జే రాబర్ట్ ఓపెన్ హైమర్ పాత్రలో సిలియన్ మర్ఫీ నటించాడు. అద్భుతమైన నటనతో మెప్పించాడు. ఇక బార్బీ సినిమాలో మార్గోట్ రాబీ మరియు ర్యాన్ గోస్లింగ్ లు ముఖ్య పాత్రల్లో నటించి మెప్పించారు.