ఇండియన్ బాక్సాఫీస్ పై హాలీవుడ్ జోరు
ఇప్పటి వరకు అయితే ఓపెన్ హైమర్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయిన మూవీగా నిలిచిందని చెప్పొచ్చు.
By: Tupaki Desk | 8 Aug 2023 4:36 AM GMTహాలీవుడ్ సినమాలని కూడా ఆదరించే ప్రేక్షకులు ఇండియాలో ఉన్నారు. ముఖ్యంగా కొంత మంది దర్శకులకి, నటులకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఈ కారణంగా వారి సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి అంటే ఎగబడి చూస్తారు. హాలీవుడ్ సినిమాలలో కొన్నయితే ఇండియాలో లోకల్ మూవీస్ స్థాయిలో భారీ కలెక్షన్స్ రాబడతాయి. అలా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు నాలుగు హాలీవుడ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి.
ఇలా వచ్చిన వాటిలో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మూవీగా ఓపెన్ హైమర్ నిలిచింది. ఈ చిత్రం ఏకంగా 135 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.క్రిస్టోఫర్ నోలన్ సినిమాలకి ఇండియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.
హై ఇంటలెక్చువల్ గా ఉండే ఇతని కథలని చాలా మంది ఇష్టపడతారు. అందులో భాగంగా మొదటిగా అణుబాంబుని సృష్టించిన ఓపెన్ హైమర్ లైఫ్ స్టొరీతో చేసిన ఈ చిత్రాన్ని ఇండియన్ ఆడియన్స్ విపరీతంగా ఆదరించారు.
దీని తర్వాత మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లో భాగంగా వచ్చిన మిషన్ ఇంపాజిబుల్ 7. టామ్ క్రూస్ హీరోగా తెరకెక్కిన ఈ సిరీస్ ని హీరో చేసే సాహస విన్యాసాలు చూడటానికి ప్రత్యేకంగా వెళ్తూ ఉంటారు . జేమ్స్ బాండ్ సిరీస్ తరహాలోనే మిషన్ ఇంపాజిబుల్ కి కూడా ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సిరీస్ లో ఏడో భాగంగా వచ్చిన మిషన్ ఇంపాజిబుల్ 7 మూవీ ఇండియాలో 125 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది.
మిషన్ ఇంపాజిబుల్ 7తో పాటు రిలీజ్ అయిన మరో హాలీవుడ్ మూవీ బార్బీ. ఈ సినిమా ముఖ్యంగా ఇండియాలో మల్టీప్లెక్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యింది. కామెడీ, డ్రామాతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులని నవ్వించడంలో సక్సెస్ అయ్యింది. దీంతో పెద్దగా ఐడెంటిఫై లేకపోయిన ఈ మూవీ ఏకంగా 50 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది
తాజాగా మెగ్ 2 మూవీ రిలీజ్ అయ్యింది. ఈ సిరీస్ లో మొదటి భాగం సూపర్ సక్సెస్ కావడంతో డానికి కొనసాగింపుగా మెగ్ 2 రిలీజ్ చేశారు. ఈ మూవీలో కూడా అద్భుతమైన సముద్ర జీవుల బీభత్సం, సాహసాలు చూపించారు. అయితే ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదని చెప్పాలి. ఇప్పటి వరకు అయితే ఓపెన్ హైమర్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయిన మూవీగా నిలిచిందని చెప్పొచ్చు.