'నాటు నాటు'కు సంచలనాల హాలీవుడ్ నిర్మాత డ్యాన్స్
నాటు నాటు పాటకు ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు సెలబ్రిటీలు డ్యాన్సులు చేసిన వీడియోలు అంతర్జాలంలో సంచలనం సృష్టించాయి.
By: Tupaki Desk | 30 Nov 2023 4:11 AM GMTRRR `నాటు నాటు...` సంచలనాల గురించి తెలిసిందే. ఇండియా నుంచి ఆస్కార్ అందుకున్న తొలి ఒరిజినల్ మ్యూజికల్ సాంగ్ గా చరిత్ర సృష్టించింది. మరకతమణి ఎం.ఎం.కీరవాణి-చంద్రబోస్-రాజమౌళి బృందం ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది. నాటు నాటు పాటకు ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు సెలబ్రిటీలు డ్యాన్సులు చేసిన వీడియోలు అంతర్జాలంలో సంచలనం సృష్టించాయి. ఇప్పుడు ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు, నిర్మాత మైఖేల్ కిర్క్ డగ్లస్ ఆర్.ఆర్.ఆర్ నాటు నాటు పాటకు డ్యాన్సులు చేస్తూ సందడి చేసాడు. ఇందుకు గోవాలో IFFI 2023 వేదికగా మారింది.
ఇఫీ వేదికగా మైఖేల్ డగ్లస్ సత్యజిత్ రే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారం అందుకున్నారు. ఇదే సందర్భంగా సహచరులతో కలిసి నాటు నాటుకి డ్యాన్సులు చేస్తున్న వీడియో అంతర్జాలంలో వైరల్ అవుతోంది. ఇటీవల మైఖేల్ డగ్లస్ భారతీయ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. భారతదేశంలో ఉన్నందుకు తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మైఖేల్ డగ్లస్ ఇలా అన్నాడు. ``ఇది కేవలం శక్తి కలయిక. ఆత్మ, ఇంద్రియాలు, రంగులు, వ్యక్తులు నాకు చాలా స్నేహపూర్వకంగా కనిపిస్తారు`` అని అన్నారు. IFFI 2023లో సత్యజిత్ రే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నప్పుడు Mr డగ్లస్ ఇలా అన్నారు, ``నేను 55 సంవత్సరాలుగా సినిమాలు చేస్తున్నాను. ఇది ఒక సుందరమైన అవగాహన. మీ సినిమా ప్రపంచమంతటా ప్రయాణిస్తుంది`` అని అన్నారు.
డగ్లస్ డిజిటల్ టెక్నాలజీ - ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫిల్మ్ మేకింగ్‌ను ఎలా ప్రభావితం చేశాయో కూడా నొక్కి చెప్పారు. ఈ విప్లవం సెల్యులాయిడ్ నుండి డిజిటల్‌కి వెళుతోంది. సినిమాలు ఖరీదైన వినోదం. కానీ డిజిటల్‌తో మీరు మీ ఐఫోన్‌తో సినిమా తీయవచ్చు... అని తెలిపారు. తనలో మార్పు తెచ్చిన అర్ధవంతమైన ప్రాజెక్ట్‌ల గురించి మాట్లాడుతూ మిస్టర్ డగ్లస్ తాను నిర్మించిన మొదటి చిత్రం- వన్ ఫ్లూ ఓవర్ ది నైటింగేల్ నెస్ట్ అని చెప్పాడు. ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం నా అదృష్టం. విజయం నా కెరీర్‌లో ప్రారంభమైంది అప్పుడే. నేను ఎప్పుడూ ఊహించని నిర్మాతను అని కూడా అన్నారు.
బాలీవుడ్ చిత్రాలపైనా డగ్లస్ వ్యాఖ్యానించారు. భారతదేశం ఇతర దేశాల కంటే ఎక్కువ సినిమాలు తీస్తుందని చెప్పారు. సినిమా థియేటర్ అనుభవం ఇక్కడ చాలా సజీవంగా ఉంది. భారతదేశంలో అలాంటి అనేక థియేటర్లు ఉన్నాయి. భారతదేశం నుండి ప్రపంచం కోసం ఒక చిత్రాన్ని రూపొందించడానికి తమ బృందం పని చేస్తుందని ఆయన తెలిపారు.