Begin typing your search above and press return to search.

అంబానీ కోసం దిగొచ్చిన హాలీవుడ్!

నేడు జ‌రుగుతోన్న అంబానీ ఇంట పెళ్లికి అతిర‌ధ మ‌హార‌థులంతా హాజ‌ర‌వుతున్నారు.

By:  Tupaki Desk   |   12 July 2024 9:21 AM GMT
అంబానీ కోసం దిగొచ్చిన హాలీవుడ్!
X

నేడు జ‌రుగుతోన్న అంబానీ ఇంట పెళ్లికి అతిర‌ధ మ‌హార‌థులంతా హాజ‌ర‌వుతున్నారు. దేశ‌, విదేశాలే అంబానీ కోసం క‌దిలాయి. విదేశీ అతిథుల జాబితాలో అమెరికా రాజకీయ నేత జాన్ కెర్రీ, యూకే మాజీ ప్రధానులు టోనీ బ్లెయిర్, బోరిస్ జాన్సన్, మాల్దీవ్స్ మాజీ ప్రెసిడెంట్ మహమ్మద్ నషీద్ వంటి రాజకీయ ప్రముఖులు హ‌ర‌వుతున్నారు. అలాగే అలానే నోకియా మొబైల్ నెట్వర్క్స్ ప్రెసిడెంట్ టామీ ఉట్టో, ఎరిక్సన్ కంపెనీ సీఈఓ, ప్రెసిడెంట్ బోర్జ్ ఎఖోల్మ్, హెచ్పీ కంపెనీ సీఈఓ, ప్రెసిడెంట్ ఎన్రిక్ లోర్స్ వంటి వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులు హాజరవుతున్నారు.

ముంబై అంత‌ర్జాతీయ విమాన‌శ్ర‌య‌మంతా విదేశీ అతిధుల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతోంది. ఇంత‌వ‌ర‌కూ ఎప్పుడు ఇండియాకి ఇంత‌మంది దిగ్గ‌జాలు వ‌చ్చింది లేదు. గ‌తంలో అంబానీ ఇంటి పెళ్లికే వ‌చ్చి ఉంటారు. మ‌ళ్లీ అదే అంబానీ వివాహానికే హాజ‌ర‌వుతున్నారు. రియాలిటీ హాలీవుడ్ టీవీ స్టార్లు కిమ్ కర్దాషియాన్ - ఖోలే కర్దాషియాన్ కూడా కొన్ని గంట‌ల క్రిత‌మే ముంబైలో ల్యాండ్ అయ్యారు. దానికి సంబంధించిన వీడియో ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతోంది.

ఓ వీడియోలో `కిమ్ కర్దాషియాన్ స్టైల్‌గా నడుచుకోవడం చూడవచ్చు. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా వారు తాజ్ హోట‌ల్ కి చేరుకున్నారు. ఇక కిమ్ దుస్తుల విష‌యానికి వ‌స్తే.. ఆలివ్ గ్రీన్ బ్యాక్‌లెస్ బాడీకాన్ డ్రెస్‌లో అద్భుతంగా మ‌స్తాబైంది. డిఫ‌రెంట్ హెయిర్ స్టైలో మెరిసిపోతుంది. అలాగే కిమ్ సోదరి ఖోలే కర్దాషియాన్ కూడా ఈ వీడియోలో కనిపించింది. ఖోలే కిమ్ వెనుక నడవడం చూడవచ్చు. వీళ్లిద్ద‌రి రాక‌ను చూసి నెటి జ‌నులు ఆశ్చ‌ర్యపోతున్నారు.

వాళ్ల అభిమానులు ఇండియాలో కూడా భారీగానే ఉన్నార‌ని లుస్తోంది. `భారతదేశంలో కిమ్ కర్దాషియాన్, నమ్మశక్యం కానిది` అంటూ ఓ యూజ‌ర్ పోస్ట్ చేసాడు. అలాగే మ‌రొక‌రు `అంబానీ పెళ్లి = అల్టిమేట్ సెలెబ్ మూమెంట్` అని పోస్ట్ చేసాడు. `ఇది నెక్స్ట్-లెవల్ సెలబ్రిటీ మ్యాజిక్` అని ఇంకొక‌రు.. `నో ఫూ**యింగ్ వే` అని మ‌రొక‌రు ఇలా ర‌క‌ర‌కాల కామెంట్ల‌తో అంబానీ ఇంట పెళ్లిని మ‌రింత మోతెక్కిస్తున్నారు.

అలాగే ఈ వివాహానికి గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా - ఆమె భర్త, అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ నిన్న రాత్రే నగరానికి చేరుకున్నారు. వీరితో పాటు కాల్మ్ డౌన్ సింగర్ రెమా, డెస్పాసిటో ఫేమ్ లూయిస్ ఫోన్సీ, అమెరికన్ లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ కూడా హాజ‌ర‌వుతున్నారు.