'హోమ్ టౌన్' టీజర్.. ఇది మరో 90's కిడ్స్ కథ!
తాజాగా విడుదలైన ‘హోమ్ టౌన్’ టీజర్ ఈ వెబ్ సిరీస్‌పై మరింత ఆసక్తిని పెంచింది. డైలాగ్స్ కూడా నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.
By: Tupaki Desk | 10 March 2025 6:51 PM ISTసినిమాలే కాకుండా ఇప్పుడు ఓటీటీ వేదికలు కూడా విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా 90's కిడ్స్ లో మర్చిపోలేని జ్ఞాపకాలను నింపుకున్న యూత్‌ని టార్గెట్ చేస్తూ రూపొందుతున్న వెబ్ సిరీస్‌లు విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంటున్నాయి. ఈ కోవలోనే ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా నుంచి మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్ ‘హోమ్ టౌన్’ విడుదలకు సిద్ధంగా ఉంది. లేటెస్ట్ గా టీజర్ విడుదల చేయగా వైరల్ అవుతోంది.
యూత్‌ఫుల్ ఎంటర్టైనర్‌గా రానున్న ఈ వెబ్ సిరీస్, స్కూల్ రోజులు, ఫేస్ బుక్ ఆరంభం, ఫస్ట్ లవ్, ఫ్రెండ్‌షిప్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ కలిపి, కొత్త తరం ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందించబోతోంది. శ్రీకాంత్ రెడ్డి పల్లె దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్, నవీన్ మేడారం, శేఖర్ మేడారం సంయుక్తంగా నిర్మించారు. ఈ వెబ్ సిరీస్‌లో ప్రముఖ నటులు ఝాన్సీ, రాజీవ్ కనకాల, ప్రజ్వల్ యాద్మ, జ్యోతి ప్రధాన పాత్రల్లో నటించారు. అంతేకాదు, బిగ్ బాస్ ఫేమ్ అభినవ్ కూడా ఇందులో భాగం కావడం ప్రత్యేక ఆకర్షణ.
టీజర్ చూసిన ప్రేక్షకులు, ఇందులోని ఎమోషనల్ మూమెంట్స్‌కు కనెక్ట్ అవుతూ మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. స్కూల్ విద్యార్థులు, వారి ఆత్మీయ సంబంధాలు, చిన్నప్పుడు చేసిన వెర్రితనాలు, ఫస్ట్ క్రష్, చదువుతో ముడిపడిన అనేక ఆసక్తికరమైన సంఘటనలు ఇందులో ఉంటాయి. ముఖ్యంగా స్కూల్లో మార్కులు రాక, పాస్ కావడానికి స్టూడెంట్స్ చేసే ట్రిక్స్.. వాటి వల్ల ఇంట్లో పడే చిక్కులు.. ఇవన్నీ ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ అవుతాయి.
తాజాగా విడుదలైన ‘హోమ్ టౌన్’ టీజర్ ఈ వెబ్ సిరీస్‌పై మరింత ఆసక్తిని పెంచింది. డైలాగ్స్ కూడా నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. చిన్నతనం జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసేలా టీజర్‌లో చూపించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఇన్‌గేజ్ చేయడంలో విజయవంతమయ్యాయి. ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 4 నుంచి ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఆహా చాలా విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులకు హిట్ వెబ్ సిరీస్‌లు అందించింది. ఇప్పుడు ‘హోమ్ టౌన్’ కూడా అదే జాబితాలో చేరుతుందా? అన్నది చూడాలి.