Begin typing your search above and press return to search.

హ‌నీరోజ్ నిర్మాణ సంస్థ‌లో హీరోలెవ‌రో?

ఈ నేప‌థ్యంలో తాజాగా అమ్మ‌డు సొంత నిర్మాణ సంస్థ‌ను స్థాపించింది. హ‌నీ రోజ్ వ‌ర్గీస్ ప్రొడ‌క్ష‌న్ పేరుతో బ్యాన‌ర్ స్థాపించింది.

By:  Tupaki Desk   |   7 Sep 2024 7:44 AM GMT
హ‌నీరోజ్ నిర్మాణ సంస్థ‌లో హీరోలెవ‌రో?
X

'వీర‌సింహారెడ్డి'తో టాలీవుడ్ లో పాపుల‌ర్ అయిన హాట్ బ్యూటీ హనీరోజ్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అమ్మ‌డు న‌టిగా చాలా సీనియ‌ర్ . వివిధ భాష‌ల్లో చాలా సినిమాలు చేసింది. తెలుగులో కెరీర్ ఆరంభంలోనే ఎంట్రీ ఇచ్చింది. కానీ బాల‌య్య సినిమాతోనే అమ్మ‌డు ఎక్కువ‌గా పాపుల‌ర్ అయింది. తెలుగు యువ‌త‌లో ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ని ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా అవ‌కాశాలు బాగానే వ‌స్తున్నాయి.

సౌత్ లో ఎక్కువ‌గా సినిమాలు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా అమ్మ‌డు సొంత నిర్మాణ సంస్థ‌ను స్థాపించింది. హ‌నీ రోజ్ వ‌ర్గీస్ ప్రొడ‌క్ష‌న్ పేరుతో బ్యాన‌ర్ స్థాపించింది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా అధికారికంగా ప్ర‌క‌టించింది. దానికి సంబంధించిన లోగోనూ కూడా మార్కెట్ లోకి వ‌దిలింది. 'సినిమా అనేది చాలా మంది క‌ల‌. ఒక విజ‌న్..వెంచ‌ర్..అదోక ఫాంట‌సీ. అదోక జీవిత కోరిక‌.

సినిమా రంగంలో దాదాపు 20ఏళ్ల‌గా ఉన్నాను. దీన్ని నేను ఓ వ‌రంలా భావిస్తున్నాను. నా య‌వ్వ‌నం, జీవితం, చ‌దువు, స్నేహం ఇలా అన్నింటిలోనూ సినిమానే పెద్ద పాత్ర పోషించడం నా క‌ర్త‌వ్యంగా భావించాను. అభిమానుల నుంచి మంచి ఆద‌ర‌ణ ద‌క్క‌డంతోనే నేను ఈస్థాయిలో ఉన్నాను. ఈ ప్రేమ ఎప్ప‌టికీ కొన‌సాగుతుంద‌ని ఆశిస్తున్నాను' అని తెలిపింది.

అయితే తొలి సినిమా మాత్రం ఏహీరోతో అన్న‌ది మాత్రం ఇంకా చెప్ప‌లేదు. న‌టిగా కెరీర్ ప్రారంభించి నిర్మాత‌గా మార‌డం అంటే అంత ఈజీ కాదు. అందులోనూ ఇండ‌స్ట్రీలో బ్యాక‌ప్ లేకుండా ఇంత‌వ‌ర‌కూ రావ‌డం అంటే ఆషామాషీ . ఎంతో కృషీ, ప‌ట్టుద‌ల ఉంటే మాత్ర‌మే సాధ్యం. ఆరకంగా ఇండ‌స్ట్రీలో హ‌నీరోజు ఎదిగిన వైనం మాత్రం న‌వ‌తారానికి మంచి స్పూర్తి అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.