Begin typing your search above and press return to search.

NYE స్పెష‌ల్: హ‌నీరోజ్ అద‌ర‌గొట్టిందిగా

2023 సంక్రాంతి బ‌రిలో విడుద‌లైన `వీర సింహారెడ్డి` చిత్రంలో న‌టించింది హ‌నీరోజ్. ఈ సినిమా చ‌క్క‌ని విజ‌యం అందుకుంది.

By:  Tupaki Desk   |   1 Jan 2024 5:49 AM GMT
NYE స్పెష‌ల్: హ‌నీరోజ్ అద‌ర‌గొట్టిందిగా
X

2023 సంక్రాంతి బ‌రిలో విడుద‌లైన `వీర సింహారెడ్డి` చిత్రంలో న‌టించింది హ‌నీరోజ్. ఈ సినిమా చ‌క్క‌ని విజ‌యం అందుకుంది. కొన్నేళ్ల క్రిత‌మే తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మైన ఈ బ్యూటీకి ఇది ఒక సువ‌ర్ణ అవ‌కాశంగా మారింది. బాల‌య్య సినిమాతో స‌క్సెస్ త‌న ద‌రికి చేరింది. ఆ త‌ర్వాత టాలీవుడ్ స‌ర్కిల్స్ లో హ‌నీ వైబ్స్ గురించి తెలిసిందే. ఓ వైపు గ్లామ‌ర‌స్ పాత్ర‌ల‌తో మ‌రోవైపు షాపుల‌ రిబ‌న్ క‌టింగులు, షో రూమ్ లాంచ్ ల‌తో బాగానే ఆర్జించిన హ‌నీరోజ్.. ప‌లు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు సంత‌కాలు చేసింది.


గ‌త సంవ‌త్స‌రం హ‌నీరోజ్ కి బాగా క‌లిసొచ్చింది. కొత్త సంవ‌త్స‌రంలో త‌న స్టార్ డ‌మ్ ని మ‌రో స్థాయికి తీసుకెళ్లాల‌ని ఆశ‌ప‌డుతోంది. ఇంత‌లోనే పాత సంవ‌త్స‌రానికి భాయ్ చెబుతూ కొత్త సంవ‌త్స‌రం వైబ్స్ తో అభిమానుల ముందుకు వ‌చ్చింది. త‌న ఫ్యాన్స్ కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు చెబుతూ స్పెష‌ల్ ఫోటోషూట్ ని ఇన్ స్టాలో షేర్ చేసింది హ‌నీ. ``మీ అందరికీ అద్భుతమైన 2024 శుభాకాంక్షలు..


అద్భుతాలు చేయండి`` అని వ్యాఖ్యను జోడించింది. నావీ బ్లూ టైట్ ఫ్రాక్ లో హ‌నీరోజ్ అంద‌చందాలు కుర్రాళ్ల మ‌తులు చెడ‌గొడుతున్నాయి.


కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. హనీ రోజ్ ప్రధాన పాత్రలో నటించిన రేచెల్ చిత్రీకరణ డిసెంబర్ 20 తో ముగిసింది. కొత్త సంవ‌త్స‌రంలో ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. తాజా నోట్ లో రేచ‌ల్ షూటింగ్ అనుభవం గురించి మాట్లాడింది. ఈ మూవీ చిత్రీకరణ తనకు మరచిపోలేని అధ్యాయం అని పేర్కొంది. తన 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో తనకు ఎదురైన అనుభవానికి భిన్నంగా `రేచెల్` అనుభ‌వాలు వెంటాడుతున్నాయ‌ని కూడా చెప్పింది. ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌లో అడుగు పెట్టడం ఒక ప్రత్యేకమైన అనుభవం. హీరోయిన్‌గా నా 18 ఏళ్ల కెరీర్‌లో మొదటిసారిగా, రేచల్‌ని అత్యంత ఆకర్షణీయమైన పాత్రగా మార్చిన డైనమిక్ , ప్యాషనేట్ లేడీ డైరెక్ట‌ర్ శ్రీమతి ఆనందిని బాలా మార్గదర్శకత్వంలో పని చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. .. అని రాసింది. బాబూరాజ్, కళాభవన్ షాజోన్, జాఫర్ ఇడుక్కి, రాధిక, వందిత, త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు.