'పుష్ప-2'కి పరిశ్రమ సన్మానమా?
ఓ తెలుగు హీరో హిందీ మార్కెట్ లో ఇలాంటి సంచలనం నమోదు చేయడంతో భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఇదే మొట్ట మొదటిసారి.
By: Tupaki Desk | 30 Dec 2024 1:30 PM GMT'పుష్ప-2'తో ఇండియాన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వసూళ్లతో బాలీవుడ్ ని షేక్ చేసింది. ఖాన్ లు..కపూర్ ల రికార్డులను తిరగరాసింది. 700 కోట్లకు పైగా వసూళ్లను ఒక్క నార్త్ బెల్ట్ లోనే సాధించింది. ఓ తెలుగు హీరో హిందీ మార్కెట్ లో ఇలాంటి సంచలనం నమోదు చేయడంతో భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఇదే మొట్ట మొదటిసారి. బాక్సాఫీస్ వద్ద బాలీవుడ్ హీరోలందర్నీ పక్కకు నెట్టేసి ఓ కొత్త చరిత్ర రాసాడు ఐకాన్ స్టార్.
ఇక వరల్డ్ వైడ్ గా 1700 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. మరికొన్ని రోజులు ఇదే దూకుడు కొనసాగిస్తే `బాహుబలి 2` పేరిట ఉన్న 1800 కోట్ల వసూళ్లను, బాలీవుడ్ `దంగల్` పేరిట ఉన్న 2000 కోట్ల వసూళ్లను సైతం వెనక్కి నెట్టేస్తుం దనే అంచనాలు తెరపైకి వస్తున్నాయి. ట్రేడ్ సైతం ఎంతో నమ్మకంగా కనిపిస్తుంది. అయితే ఇదే జరిగితే టాలీవుడ్ లో భారీ సెలబ్రేషన్లకు పుష్పరాజ్ రెడీ అవ్వాల్సిందే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.
చిత్ర యూనిట్ సెలబ్రేషన్ జరుపుకోవడం అన్నది సహజమే. సక్సెస్ లో భాగంగా టీమ్ అంతా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. అభిమానుల సమక్షంలో సక్సెస్ వేడుకలు నిర్వహిస్తుంటారు. అయితే నేరుగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ అన్ని శాఖలు సమన్వయంతో పుష్ప-2 టీమ్ ని సన్మానించాలనే ఓ ఆలోచన కూడా ఉందనే వార్త లీకైంది.
తొలిసారి ఓ తెలుగు సినిమా నటుడు జాతీయ ఉత్తమ నటుడుగా ఎంపికవ్వడం అన్నది బన్నీతోనే సాధ్యమైంది. సీనియర్ హీరోలు, ఆ తర్వాత తరం నటులు ఉన్నా ఎవరికీ సాధ్యం కానిది బన్నీ సాధ్యం చేసి చూపించాడు. పుష్పకి గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. పుష్ప-2 విజయం బాలీవుడ్ సినీ చరిత్రలో నిలిచిపోయింది. ఈనేపథ్యంలోనే పుష్ప టీమ్ ని సన్మానంతో స్మరించుకోవాలని పరిశ్రమ వర్గాలు భావిస్తు న్నాయట. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాల్సి ఉంది.