ఎన్టీఆర్ సుడిగాలి పర్యటనల వెనక లాజిక్!
ఈనెల 22న హైదరాబాద్ నోవాటెల్ లో జరిగే ప్రీరిలీజ్ ఈవెంట్ కి అటెండయి, ఆ మరుసటి రోజునే అమెరికా వెళతారని సమాచారం.
By: Tupaki Desk | 17 Sep 2024 4:48 PM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ సుడిగాలి పర్యటనలు ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈనెల 27న దేవర రిలీజ్ కి సిద్ధమవుతుంటే, అటు హిందీ బెల్ట్ లో కోలీవుడ్ లో అవసరమైన ప్రచారం చేసారు. దీనికోసం ముంబై, చెన్నై చుట్టేసారు. అయితే బెంగళూరు, హైదరాబాద్ లో మీడియాతో చాటింగులు పెండింగులో ఉన్నాయి.
ఈలోగానే తారక్ అమెరికా వెళతారని గుసగుస వినిపిస్తోంది. ఈనెల 22న హైదరాబాద్ నోవాటెల్ లో జరిగే ప్రీరిలీజ్ ఈవెంట్ కి అటెండయి, ఆ మరుసటి రోజునే అమెరికా వెళతారని సమాచారం. తిరిగి సెప్టెంబర్ 27న ఇండియాకు వస్తారు. ఇక ఈనెల 19న పంజాబ్- ఛండీఘడ్ లో ప్రమోషనల్ క్యాంప్ లో పాల్గొంటారని కూడా టాక్ ఉంది. అయితే బెంగళూరు, హైదరాబాద్ లలో ప్రచారానికి ఎన్టీఆర్ అటెండవుతారా లేదా? అన్నది సందిగ్ధంగా మారింది.
సోలో కథానాయకుడిగా నటించిన సినిమా కాబట్టి దేవరను తన కెరీర్ లో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ అంటూ తారక్ ప్రొజెక్ట్ చేస్తున్నారు. నిజమే... ఆర్.ఆర్.ఆర్ లో చరణ్‌తో కలిసి నటించాడు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ లీడ్ పాత్రలో దేవర1 మొత్తాన్ని తన భుజస్కంధాలపై వేసుకుని నడిపించాడు. పైగా పాన్ ఇండియా మార్కెట్ ని ఛేజిక్కించుకోవాలన్న తపన కూడా ఎన్టీఆర్ లో కనిపిస్తోంది. అందుకే ఇలా మెట్రోలన్నీ తిరిగి తారక్ ప్రచారం చేస్తున్నారన్నమాట!!