Begin typing your search above and press return to search.

పుష్ప 2 vs RRR… బిజినెస్ లో ఎంత తేడా?

ఓవరాల్ గా చూసుకుంటే 'పుష్ప 2' బిజినెస్ పరంగా రెండో స్థానంలో ఉన్నా కూడా కొన్ని ఏరియాలలో మాత్రం 'ఆర్ఆర్ఆర్' ని దాటేసింది.

By:  Tupaki Desk   |   19 Oct 2024 4:51 AM GMT
పుష్ప 2 vs RRR… బిజినెస్ లో ఎంత తేడా?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప 2' డిసెంబర్ 6న థియేటర్స్ లోకి రాబోతోంది. పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషలలో రిలీజ్ కాబోయే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. నార్త్ ఇండియాలో అయితే 'పుష్ప 2' కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. కచ్చితంగా ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా చాలా రికార్డులని బ్రేక్ చేస్తుందని బన్నీ అభిమానులు భావిస్తున్నారు.

మొదటి రోజు 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాపై ఇప్పటికే థీయాట్రికల్, నాన్ థీయాట్రికల్ బిజినెస్ కంప్లీట్ అయ్యిందిని టాక్. తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాపై 193.7 కోట్ల బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 'ఆర్ఆర్ఆర్' తర్వాత అత్యధిక బిజినెస్ ఈ సినిమాకే జరగడం విశేషం. 'ఆర్ఆర్ఆర్' మూవీ పైన 224 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ తెలుగు రాష్ట్రాలలో జరిగింది.

ఓవరాల్ గా చూసుకుంటే 'పుష్ప 2' బిజినెస్ పరంగా రెండో స్థానంలో ఉన్నా కూడా కొన్ని ఏరియాలలో మాత్రం 'ఆర్ఆర్ఆర్' ని దాటేసింది. ఉత్తరాంధ్రలో 'ఆర్ఆర్ఆర్' రైట్స్ 23 కోట్లకి అమ్ముడయ్యాయి అయితే 'పుష్ప 2'పైన 23.4 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరగడం విశేషం. అలాగే గుంటూరులో 'ఆర్ఆర్ఆర్' పైన 14 కోట్ల వ్యాపారం జరిగితే 'పుష్ప 2' కి 15.3 కోట్ల బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. మిగిలిన ఏరియాలలో 'ఆర్ఆర్ఆర్' కంటే 'పుష్ప 2' కి తక్కువ బిజినెస్ జరిగిందని టాక్.

నైజాంలో RRR కు సమానంగా 80 కోట్ల లెక్కతో నిలిచినట్లు తెలుస్తోంది. సీడెడ్ లో 'ఆర్ఆర్ఆర్' కి 50 కోట్ల బిజినెస్ జరగగా 'పుష్ప 2' పైన 30 కోట్లు జరిగింది. అంటే 20 కోట్లు తక్కువగా డీల్ జరిగింది.తూర్పు గోదావరిలో 'ఆర్ఆర్ఆర్' కి 18 కోట్ల బిజినెస్ జరిగింది. అయితే 'పుష్ప 2' పైన 3.6 కోట్లు తక్కువగా 14.4 కోట్ల వ్యాపారం అయ్యింది. కృష్ణాలో 'ఆర్ఆర్ఆర్' పైన 14 బిజినెస్ జరగగా, 'పుష్ప 2' కి 12.6 కోట్లు జరిగిందట.

ఇక పశ్చిమ గోదావరిలో 'ఆర్ఆర్ఆర్' పైన 16 కోట్ల వ్యాపారం జరిగినట్లు టాక్. ఇక అక్కడ 'పుష్ప 2' కి 10.6 కోట్ల బిజినెస్ అయ్యిందని తెలుస్తోంది. అయితే 'ఆర్ఆర్ఆర్' రాజమౌళి బ్రాండ్ తో రావడం వలన భారీగా బిజినెస్ జరిగిన కూడా రెట్టింపు కలెక్షన్స్ ఎగ్జిబిటర్లుకి వచ్చాయి. మరి 'పుష్ప 2' ఏ మేరకు లాభాలు ఇస్తుందనేది వేచి చూడాలి.