Begin typing your search above and press return to search.

అడివి శేష్ ఇంకెన్నాళ్లు ఈ వెయిటింగ్..?

ఆ సినిమా తెలుగు ఆడియన్స్ ని మెప్పించడంతో అతని సినిమా అంటే చాలు ఆడియన్స్ అంతా అలర్ట్ అవుతున్నారు.

By:  Tupaki Desk   |   16 Jun 2024 11:30 PM GMT
అడివి శేష్ ఇంకెన్నాళ్లు ఈ వెయిటింగ్..?
X

చేసేది లిమిటెడ్ బడ్జెట్ సినిమాలే అయినా తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంలో తాను కూడా ఉన్నానని తన సినిమాల ద్వారా చెబుతున్నాడు అడివి శేష్. కెరీర్ మొదట్లో అతను రాసి డైరెక్ట్ చేసి నటించిన సినిమాలను ఎవరు పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే అతను స్టార్ సినిమాల్లో నటించి ఒక గుర్తింపు తెచ్చుకున్నాడో అప్పటి నుంచి ఆడియన్స్ లో అతని సినిమాల మీద ఫోకస్ ఏర్పడింది. క్షణం తో అడివి శేష్ సినిమాల గురి కుదిరింది. ఆ సినిమా తెలుగు ఆడియన్స్ ని మెప్పించడంతో అతని సినిమా అంటే చాలు ఆడియన్స్ అంతా అలర్ట్ అవుతున్నారు.

ఐతే సినిమాలు ప్రేక్షకులను మెప్పించాలంటే వాటిని కాస్త టైం తీసుకుని తీయాల్సి ఉంటుంది. అందుకే 2022 లో మేజర్, హిట్ 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అడివి శేష్ రెండేళ్లు అవుతున్నా ఇంకా తన నెక్స్ట్ సినిమాను రిలీజ్ చేయలేదు. ప్రస్తుతం రెండు భారీ సినిమాలను సెట్స్ మీద ఉంచిన అడివి శేష్ ఆ రెండు అప్డేట్స్ విషయంలో కూడా ఆడియన్స్ ని డిజప్పాయింట్ చేస్తున్నాడు.

అడివి శేష్ హీరోగా సూపర్ హిట్ మూవీ గూఢచారికి సీక్వెల్ గా జి 2 సినిమా వస్తుంది. ఈ సినిమాను వినయ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. తెలుగు తెర మీద అసలు సిసలైన స్పై థ్రిల్లర్ ని చూపిస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్న అడివి శేష్ జి2 తో మరో అదిరిపోయే ప్రాజెక్ట్ తో వస్తున్నాడు. ఇక దీనితో పాటుగా డెకాయిట్ అంటూ మరో సినిమా చేస్తున్నాడు అడివి శేష్.

శానీల్ డియో డైరెక్ట్ చేస్తున్న డెకాయిట్ సినిమా కూడా డిఫరెంట్ అటెంప్ట్ గా రాబోతుంది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ రెండు సినిమాలతో బిజీగా ఉన్న అడివి శేష్ అవుట్ పుట్ తనకు సాటిస్ఫైడ్ అనిపించినప్పుడే రిలీజ్ అంటున్నాడు. అయితే జి2, డెకాయిట్ రెండిటిలో ఒక సినిమా మాత్రం 2025 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ రెండు సినిమాల బడ్జెట్ కూడా 150 కోట్ల దాకా పెడుతున్నారట. ఆడియన్స్ ఎంత వెయిట్ చేస్తున్నా సరే అనుకున్న ప్రాజెక్ట్ అనుకున్న విధంగా పూర్తయ్యే దాకా రిలీజ్ చేసేది లేదని అడివి శేష్ ఫిక్స్ అయ్యాడు. కచ్చితంగా ఈ ప్లానింగ్ సినిమా ఫలితానికి ఎంతో సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు.