Begin typing your search above and press return to search.

ఆ సూపర్ హిట్ రీమేక్ ముందుకు పడదేంటి..!

అనౌన్స్ మెంట్ వచ్చి ఎంతోకాలం అవుతున్నా సరే సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు.

By:  Tupaki Desk   |   29 July 2023 3:30 PM GMT
ఆ సూపర్ హిట్ రీమేక్ ముందుకు పడదేంటి..!
X

మలయాళంలో లాస్ట్ ఇయర్ వచ్చిన సూపర్ హిట్ మూవీ హృదయం. ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా కళ్యాణి ప్రియదర్శన్, దర్శన రాజేంద్రన్ ఫీమేల్ లీడ్ గా నటించిన ఈ సినిమాను వినీత్ శ్రీనివాసన్ డైరెక్ట్ చేశారు. 5 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

మలయాళంలోనే రిలీజైన ఈ సినిమా సౌత్ ఆడియన్స్ అందరిని ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా చూసిన తెలుగు ఆడియన్స్ తెలుగు డబ్ చేస్తే బాగుండేది అనుకున్నారు. కానీ ఈ సినిమాను రీమేక్ చేస్తున్నామని గీతా ఆర్ట్స్ ప్రకటించింది.

అయితే హృదయం రీమేక్ ఉంటుందని చెప్పిన గీతా ఆర్ట్స్ ఇప్పటివరకు ఆ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి ముందడుగు వేయలేదు. హృదయం సినిమాను తెలుగులో ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు. హీరో హీరోయిన్స్ గా ఎవరు నటిస్తున్నారు.

సినిమా ఎప్పుడు మొదలవుతుంది లాంటి విషయాల మీద క్లారిటీ రాలేదు. గీతా ఆర్ట్స్ నిర్మిస్తుంది అంటే కచ్చితంగా సినిమా లో మంచి కాస్టింగ్ ఇంకా డైరెక్టర్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. అయితే తెలుగులో కూడా మలయాళ స్టార్స్ నే నటింపచేయాలనే ఆలోచన కూడా ఉందని తెలుస్తుంది.

మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ తెలుగు ఎంట్రీకి ఇదే పర్ఫెక్ట్ సినిమా అని భావిస్తున్నారు. ఆల్రెడీ మోహన్ లాల్ కి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. మలయాళ దృశ్యం తరహాలో హృదయం సినిమాను కూడా తెలుగు, తమిళ భాషల్లో వేరు వేరు నటీనటులతో తెరకెక్కించాలని చూస్తున్నారు. అనౌన్స్ మెంట్ వచ్చి ఎంతోకాలం అవుతున్నా సరే సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు.

హృదయం సినిమాకు హేషం అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ అందించారు. హృదయం సినిమా హిట్ లో సంగీతం కూడా ప్రధాన పాత్ర వహించింది. హృదయం తర్వాత ప్రస్తుతం హేషం అబ్దుల్ వాహబ్ విజయ్ దేవరకొండ ఖుషి సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.

శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తుంది. హృదయం సినిమా మ్యూజిక్ తో సూపర్ హిట్ అందుకున్న అబ్దుల్ వాహబ్ తెలుగులో కుషితో ఎంట్రీ ఇస్తున్నాడు. ఒకవేళ హృదయం రీమేక్ ఎప్పుడు వచ్చినా మ్యూజిక్ డైరెక్టర్ గా అతన్నే తీసుకునే ఛాన్స్ ఉంది. సౌత్ సినిమాకు మరో టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ దొరికాడని హేషం అబ్దుల్ వాహబ్ సాంగ్స్ చూస్తే అర్ధమవుతుంది.