ఎట్టకేలకు సస్పెన్స్ కి తెరదించిన స్టార్ హీరో!
'క్రిష్-4' బాద్యతలు కరణ్ మల్హోత్రాకు అప్ప జెప్పడం విశేషం. దీంతో కరణ్ మల్హోత్రా ఖాతాలో ఇది నాల్గవ ప్రాజెక్ట్ అవుతుంది.
By: Tupaki Desk | 27 Dec 2024 10:30 AM GMT'క్రిష్-4' డైరెక్టర్ ఎంపిక విషయంలో కొన్ని నెలలుగా తర్జన భర్జన కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. 'కోయిమిల్ గయా' వరకూ 'క్రిష్ -3' వరకూ ఆ బాధ్యతలు రాకేష్ రోషన్ చూసుకున్నారు. ఆయన నుంచి పుట్టిన స్టోరీ ఐడియా కావడంతో? మరో డైరెక్టర్ తో పనిలేకుండా అన్నీ తానై పనిచేసారు. కానీ నాల్గవ భాగం మాత్రం కొత్త దర్శకుడితో వెళ్లాలా? తానే ఆ ఛాన్స్ తీసుకోవాలా? అని డైలమా కొనసాగుతుంది. కొత్త దర్శకుడైతే మేకింగ్ పరంగా కొత్తగా ఉంటుందనే ఐడియాతో రాకేష్ రోషన్ సహా హృతిక్ కూడా భావించారు.
దీనిలో భాగంగా చాలా మంది మేకర్లను పరిశీలించారు. అయితే తాము అనుకున్నట్లు ఎవరూ సెట్ కాకపోవడంతో మరోసారి ఆ ఛాన్స్ రాకేష్ రోషన్ తీసుకుంటున్నట్లు జాతీయ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ రాకేష్ రోషన్ నో వే అంటూ! కొత్త దర్శకుడిని తెరపైకి తీసుకొచ్చి సర్ ప్రైజ్ చేసారు. 'క్రిష్-4' బాద్యతలు కరణ్ మల్హోత్రాకు అప్ప జెప్పడం విశేషం. దీంతో కరణ్ మల్హోత్రా ఖాతాలో ఇది నాల్గవ ప్రాజెక్ట్ అవుతుంది. 'అగ్నిపత్' ,' బ్రదర్స్', 'శంషేరా' చిత్రాలకు గతంలో కరణ్ దర్శకత్వం వహించాడు.
ఆ సినిమాలు మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 'శంషేరా' 2022లో రిలీజ్ అయింది. ఆ తర్వాత మరో కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు. తాజాగా 'క్రిష్-4' ఛాన్స్ రావడంతో ఇకపై ఆ ప్రాజెక్ట్ పనుల్లో బిజీ కానున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా మొదలు కానుంది. ప్రస్తుతం హృతిక్ రోషన 'వార్ -2'లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ కల్లా పూర్తవుతంది. అనంతరం 'క్రిష్ -4'ని పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నారు. స్టోరీ సిద్దంగా ఉంది.
క్రిష్ ప్రాంచైజీకి సంబంధించి ఇంత వరకూ సర్వం అతనే. ఇప్పుడు కూడా బ్యాకెండ్ లో అతడి సూచనలు, సలహాల తోనే కరణ్ ప్రాజెక్ట్ టేకప్ చేస్తాడు. ఈ సినిమాకి సంబంధించి ముంబై, యూరప్ లో భారీ సెట్ నిర్మాణం పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. టైమ్ ట్రావెల్, అంతరిక్షం నేపథ్యంలో కథ సాగనుందని హృతిక్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.