సంపాదనలో ఖాన్‌లను వెనక్కి నెట్టిన హృతిక్!
భారతదేశంలో రెండవ అత్యంత సంపన్న నటుడు హృతిక్ రోషన్. ఖాన్‌ల త్రయాన్ని సైతం అతడు వెనక్కి నెట్టాడు.
By: Tupaki Desk | 1 Sep 2024 3:30 AM GMTగౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ వంటి పారిశ్రామికవేత్తలతో కలిసి వినోదరంగం నుంచి షారుఖ్ ఖాన్ మొదటిసారి హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో చేరాడు. 7,300 కోట్ల నికర విలువతో భారతదేశంలో అత్యంత ధనవంతుడు షారుఖ్ ఖాన్ అని ఈ జాబితా వెల్లడించింది. అయితే ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నదెవరో తెలుసా? భారతదేశంలో రెండవ అత్యంత సంపన్న నటుడు హృతిక్ రోషన్. ఖాన్‌ల త్రయాన్ని సైతం అతడు వెనక్కి నెట్టాడు.
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 ప్రకారం.. గత 10 సంవత్సరాలలో కేవలం 7 చిత్రాలలో మాత్రమే కనిపించిన హృతిక్ రోషన్ రూ. 2000 కోట్ల నికర విలువను కలిగి ఉండటం నిజంగా ఆశ్చర్యపరిచింది. షారుఖ్ ఖాన్ తర్వాత భారతదేశంలో రెండవ అత్యంత సంపన్న నటుడిగా హృతిక్ నిలిచాడు. అతడు నటించిన చిత్రాలకు పారితోషికం కాకుండా, హృతిక్ రోషన్ అథ్లెయిజర్ బ్రాండ్ HRX తో భారీగా ఆర్జిస్తున్నాడని కథనం వెలువడింది. ట్విట్టర్‌లో 32.3 మిలియన్ల మంది ఫాలోవర్లతో సోషల్ మీడియాలో హృతిక్ రోషన్ చాలా పాపులర్.
గ్రీక్ గాడ్ రోజుకు 27 లక్షలు సంపాదిస్తున్నట్లు సమాచారం. ఒక్కో సినిమాకు 75-100 కోట్లు వసూలు చేస్తాడు. ఆయన వార్షిక ఆదాయం దాదాపు రూ.260 కోట్లు. హృతిక్ రోషన్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా కూడా సంపాదిస్తాడు, దీనికి అతను 10-12 కోట్లు వసూలు చేస్తాడు. స్పాన్సర్ చేసిన సోషల్ మీడియా పోస్ట్‌లతో ప్రతిదానికి రూ. 4-5 కోట్లు వసూలు చేస్తాడు. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024లో షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్‌లతో పాటు జూహీ చావ్లా, అమితాబ్ బచ్చన్,కరణ్ జోహార్ కూడా జాబితాలో ఉన్నారు.
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024లో బాలీవుడ్ ప్రముఖుల వివరాల్లోకి వెళితే.. షారుఖ్ ఖాన్ అతడి కుటుంబం: రూ. 7,300 కోట్లతో నం.1 స్థానంలో ఉండగా, జుహీ చావ్లా , తన కుటుంబం: రూ. 4,600 కోట్లతో నం.2 స్థానంలో నిలిచింది. ఇక హీరోల్ల హృతిక్ రోషన్: రూ. 2,000 కోట్ల నికర సంపదతో హీరోల్లో రెండో స్థానం (ఓవరాల్ గా మూడో స్థానం)లో నిలిచాడు. అమితాబ్ బచ్చన్ అతడి కుటుంబం: రూ. 1,600 కోట్ల ఆస్తులను కలిగి ఉండగా, కరణ్ జోహార్: రూ. 1,400 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నాడు.