ఈ నెలలోనే హృతిక్, తారక్!
దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రస్తుతం వార్2 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 13 Feb 2025 5:30 AM GMTదేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రస్తుతం వార్2 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతోనే ఎన్టీఆర్ మొదటిసారి బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం వల్ల ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా అందరికీ భారీ అంచనాలున్నాయి.
మంచి విజువల్ స్టోరీ టెల్లర్ గా పేరున్న అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ తో నెక్ట్స్ లెవెల్ డ్యాన్స్ నెంబర్ ను అయాన్ ముఖర్జీ ప్లాన్ చేశాడని సినిమా మొదలైనప్పటి నుంచే వార్తలు రాగా, ఇప్పుడు ఆ సాంగ్ షూటింగ్ కు టైమొచ్చినట్టు తెలుస్తోంది.
ఈ హై ఎనర్జీ డ్యాన్స్ నెంబర్ ను ఫిబ్రవరి నెలాఖరులో షూట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే సినిమాలోని యాక్షన్ సీన్స్ ఆల్మోస్ట్ పూర్తి చేసిన వార్2 టీమ్ ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ ఇచ్చింది. ఈ నెలాఖరున నెక్ట్స్ షెడ్యూల్ ను మొదలుపెట్టి ఎన్టీఆర్, హృతిక్‌పై ఆ స్పెషల్ సాంగ్ ను షూట్ చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ వైభవి మర్చెంట్ ఈ సాంగ్ ను కొరియోగ్రఫీ చేయనున్నారు.
అటు హృతిక్ రోషన్, ఇటు ఎన్టీఆర్ ఇద్దరూ మంచి డ్యాన్సర్లు కావడంతో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే పాట ఎలా ఉంటుందా అని ఆడియన్స్ చాలా హై ఫీలవుతున్నారు. దానికి తోడు ఎన్టీఆర్ తో డ్యాన్స్ చేయడం కోసం చాలా కష్టపడుతున్నా అని స్వయంగా హృతిక్ ఓ సందర్భంలో చెప్పడంతో అప్పటివరకు ఉన్న అంచనాలు ఆకాశాన్నంటాయి.
ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్ట్ 15న వార్2 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే వార్2 షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఫ్రీ అవాలని చూస్తున్నాడు ఎన్టీఆర్. వార్2 తర్వాత ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ తో కలిసి డ్రాగన్(వర్కింగ్ టైటిట్) సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఫిబ్రవరిలోనే డ్రాగన్ షూటింగ్ కూడా మొదలయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.